భారత్‌లోకి పాక్ మాజీ మంత్రి, వెనక్కి లాగిన రేంజర్లు
న్యూఢిల్లీ: పాకిస్థాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి షా మహమూద్ ఖురేషి వాఘా సరిహద్దు దాటి భారత భూబాగంలో కాలుపెట్టారు. పాక్ సైనిక శిబిరంపై ఆత్మాహుతి దాడి జరిగిన సందర్భంలో సైనికులను కలిసి పరామర్శించేందుకు వాఘా సరిహద్దుకు చేరుకున్న ఖురేషీ, భారత సైన్యాధికారులతో కరచాలనం చేసేందుకు ముందుకు కదిలారు.
ఈ ప్రయత్నంలో పొరపాటున సరిహద్దు దాటి భారత భూబాగంపై అడుగుపెట్టినట్టు తెలిసింది. ఆయనను పాకిస్ధాన్ రేంజర్స్‌కు చెందిన సైనికుడు ఒకరు వెనక్కు లాగడం పాక్ టెలివిజన్ చానళ్లు ప్రసారం చేసిన కథనంలో కనిపించిందని సమాచారం.
ప్రస్తుతం షా మహమూద్ ఖురేషి.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌కు వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వాఘా సరిహద్దు, పాకిస్తాన్ మరియు భారతదేశం మధ్య ప్రధాన రహదారి సరిహద్దుగా ఉన్న విషయం తెలిసిందే.

కాశ్మీర్ వేర్పాటువాదులు స్వాతంత్య్ర సమరయోధులన్న పాకిస్ధాన్
కాశ్మీర్ వేర్పాటువాదులను స్వాతంత్య్ర సమరయోధులుగా పేర్కొంది పాకిస్ధాన్. ఐక్యరాజ్య సమితి తీర్మానాలు గుర్తించిన ఆక్రమిత ప్రాంతంలోనే వీరు స్వాతంత్య్ర పోరాటం చేస్తున్నారని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తస్నిమ్ అస్లాం అన్నారు.
వరల్డ్ ఎకనమిక్ ఫోర్ం సదస్సులో భారత ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపాలనుకుంటున్నారా లేక తెగతెంపులు చేసుకోవాలనుకుంటున్నారో తేల్చిచెప్పాలంటూ రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ పాక్‌ను నిలదీసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఇందుకు సంబంధించి ఓ ప్రకటన జారీ చేసింది.
అందులో కాశ్మీరీలు భారత వేర్పాటువాదులు కారని, గత కొన్ని దశాబ్దాలుగా స్వయం నిర్ణయక హక్కు కోసం పోరాడుతున్న ఓ ఆక్రమిత ప్రాంత ప్రజలని తెలిపింది. కాశ్మీర్ వేర్పాటువాదులను స్వాతంత్య్ర సమరయోధులుగా పేర్కొంటూ అస్లాం చేసిన ప్రకటన విస్తృతంగా ప్రాచుర్యం పొందింది.












Click it and Unblock the Notifications