పాకిస్థాన్ లో ప్రజల పరిస్థితి.. సోమాలియా, ఉగాండా నయం.. వీడియో వైరల్!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై భారత్ కన్నెర్ర చేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ను దెబ్బకు దెబ్బ తీయాలని కసితో ఉంది. ఇప్పటికే కఠినమైన చర్యల్లో భాగంగా పాకిస్థాన్ ను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీసింది భారత ప్రభుత్వం.
సింధూ జలాల రద్దుతోపాటు, వీసాలు రద్దు, అటారీ- వాఘా బోర్డర్ మూసివేత కారణంగా పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అలాగే పాకిస్థాన్ కు అప్పు ఇవ్వొద్దని ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ కు ప్రతిపాదనలు పంపింది. దీంతో పాకిస్థాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అతి కొద్దిరోజుల్లోనే ఆ దేశంలో ఆర్థిక మాంద్యంలో కొట్టుకుపోనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే తాజాగా పాకిస్థాన్ లో ప్రజల పరిస్థితి ఎలా ఉందో ఓ వీడియో అద్దం పడుతోంది. ఈ వీడియోలో పాకిస్థాన్ లోని దుర్భర పరిస్థితి కళ్లకు కడుతోంది. పాకిస్థాన్ లో చాలా మంది ప్రజలకు సరైన తిండి, బట్టా లేదని అర్థమవుతోంది. రోజు రోజుకీ దిగజారిపోతున్న ఆ దేశ ఆర్థిక పరిస్థితి.. అక్కడి సామాన్య ప్రజానికం రోజువారి జీవనాన్ని మరింత దుర్భర స్థితికి తెచ్చేసిందని నిపుణులు అంటున్నారు. మరోపక్క పాక్ కు పంపించే ఎగుమతులను భారత్ నిలిపివేయడంతో ఆ దేశం కరవులో కొట్టుమిట్టాడుతోంది. తాజాగా అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇక ఇప్పటికే భారత్ సింధూ నదీ జలాలు రద్దు కారణంగా పాకిస్థాన్ లోని చీనాబ్ నది ఎండిపోయింది. పాకిస్తాన్‌లో 80 శాతం జనాభాకు జీవనాడి అయిన సింధు నదికి సంబంధించి "సింధు జలాల ఒప్పందం"ను రద్దు చేసుకుంది. దీంతో సింధూ నదికి ఉపనది అయిన చీనాబ్ నది పూర్తిగా ఎండిపోయింది. తాజాగా రిలీజైన శాటిలైట్ చిత్రాలు అద్దం పడుతున్నాయి. నీటి సంక్షోభం కారణంగా అక్కడి ప్రజలు పాకిస్థాన్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు.
పాకిస్థాన్ నాయకులు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ.. ఈ వీడియో ద్వారా అక్కడి అసలు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. భారత్ దాడిచేస్తే.. పరువు కోసం తిరిగి దాడి చేయాల్సింది తప్పితే యుద్ధాన్ని తట్టుకునేంత ఆర్థిక వనరులు ఆ దేశంలో లేవని ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ వీడియోలో పాకిస్థాన్ ఓ చెత్త కుప్పలా ఉంది. ఎక్కడికక్కడ చెత్తా చెదారం పేరుకుపోయింది. సోమాలియా, ఉగాండా దేశాలు నయం అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications