హిందూ దేవాలయాన్ని పునరుద్ధరించండి: పాకిస్థాన్ సుప్రీం కోర్టు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో హిందూ మందిరాలను పరిరక్షించాలని, హిందువుల మనోభావాలకు గౌరవం ఇవ్వాలని పాకిస్థాన్ అత్యున్నత న్యాయస్థానం సుప్రీ కోర్టు స్పష్టం చేసింది. పాకిస్థాన్ లోని హిందూ దేవాలయాలను కూల్చి వేస్తుంటే మీరు ఏమి చేస్తున్నారని సుప్రీం కోర్టు ద్విసభ్య బెంచ్ ప్రశ్నించింది.
పాకిస్థాన్ లో హిందూ దేవాలయాల పవిత్రతకు భంగం కలిగేలా అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయని, మీరు జోక్యం చేసుకోవాలని డాక్టర్ రమేష్ కుమార్ వంక్వాని అనే హిందువు కోర్టును ఆశ్రయించారు. ఖైబర్ పక్తూంక్వాలోని ఓక గ్రామంలో 1919లో నిర్మించిన శ్రీ పరమహంస జీ మహరాజ్ సమాధిని కూల్చి వేశారని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.

పాకిస్థాన్ సుప్రీం కోర్టులో కేసు విచారణ జరిగింది. సమాధిని, దేవాలయాన్ని కూల్చి వేసిన ఒక మతపెద్ద ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నారని కోర్టులో చెప్పారు. వివరాలు తెలుసుసుకున్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ నాసిర్-ఉల్-ముల్క్ మీరు ఏమి చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ విషయంలో సామరస్య పరిష్కారం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నామని అదనపు అడ్వకేట్ జనరల్ వకార్ అహమ్మద్ న్యాయమూర్తికి చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం మీరు వెంటనే మత పెద్ద స్వాదీనం చేసుకున్న స్థలంలో హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించి మీరే పరిరక్షించాలని ఖైబర్ పక్తూంక్వా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications