పాక్ షాకర్: ఏడాదిన్నర పాపపై అత్యాచారం, హత్య
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని కరాచీలో అత్యంత దారుణమైన, విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఏడాదిన్నర పాపపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను గొంతు నులిమి హత్య చేశారు. పోస్టుమార్టం పరీక్షల్లో ఆ విషయం తేలింది.
పాప శవం నిజమాబాద్‌లో కనిపించింది. అయితే, పాపపై అత్యాచారం, ఆమె హత్య ఎక్కడ జరిగిందనే విషయం తెలియడం లేదని డాన్ ఆన్‌లైన్ పత్రిక తెలిపింది. పాప మృతదేహానికి శవపరీక్షథ నిర్వహించిన అదనపు పోలీసు సర్జన్ రూబీనా హసన్ పాపపై అత్యాచారం జరిగిన విషయాన్ని ధ్రువీకరించారు.

తమ ఇంటి బయట వీధిలో పాప శవం కనిపించిందని బాధితురాలి కుటుంబ సభ్యులు చెప్పినట్లు లిఖాయతాబాద్ పోలీసు సూపరింటిండెంట్ తహీర్ నూరానీ చెప్పారు. ఈ సంఘటన దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications