అట్టుడుకుతున్న పాకిస్తాన్: మొబైల్, ఇంటర్నెట్ బంద్: ఏం జరుగుతోంది?

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రవాద ఇస్లామిక్ పార్టీ తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ పాకిస్తాన్ (TLP) శుక్రవారం నిర్వహించతలపెట్టిన 'లబ్బాయిక్ అక్సా మిలియన్ మార్చ్' నిరసనను అడ్డుకునేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇస్లామాబాద్, రావల్పిండిలలో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పాటు రాజధానిలోకి ప్రవేశించే, నిష్క్రమించే అన్ని మార్గాలను మూసివేసింది.

టీఎల్‌పీ కార్యకర్తలు ఇస్లామాబాద్ వైపు ప్రదర్శన నిర్వహించేందుకు సిద్ధమవుతోన్న పరిస్థితులు వారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. లాహోర్‌లో పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఎవరూ బయటికి రాకుండా ఉండటానికి కంటైనర్లతో రహదారిని దిగ్బంధించారు. లాహోర్‌లో భద్రతా సిబ్బందికి, టీఎల్‌పీ కార్యకర్తలకు మధ్య భారీగా ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులపై రాళ్లు రువ్వారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

Pakistan Shuts Down Mobile and Internet Services Amidst Tehreek-e-Labbaik Protests

ఈ నిరసన పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా చేపట్టినట్లు టీఎల్పీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద శుక్రవారం ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రదర్శన నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో, పంజాబ్ పోలీసులు పార్టీ అధినేత సాద్ హుస్సేన్ రిజ్వీని అరెస్టు చేసేందుకు లాహోర్‌లోని టీఎల్‌పీ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడితో నగరంలో హింస చెలరేగింది.

ఈ తెల్లవారు జాము నుంచి ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి, కరాచీ వంటి నగరాల్లో ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. హింసాత్మక పరిస్థితులు మరింత విస్తరించకుండా ఉండటానికి ఆయా నగరాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ.. పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీని ఆదేశించింది. ఈ మేరకు మంత్రి మొహసిన్ నఖ్వి ఆదేశాలు జారీ చేశారు. పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ 144ను తక్షణమే అమలులోకి తెచ్చింది.

దీని కింద 10 రోజుల పాటు అన్ని రకాల నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధించారు. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు బహిరంగ ప్రదేశాలు, వీధులు, బహిరంగ స్థలాల్లో గుమిగూడడాన్ని నిషేధించినట్లు ప్రావిన్షియల్ హోం డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్ పేర్కొంది. ప్రార్థనలు, వివాహాలు, అంత్యక్రియలు, కార్యాలయాలు లేదా కోర్టు ప్రాంగణాలను ఇందులో నుంచి మినహాయించింది. పంజాబ్ అంతటా ఆయుధాల ప్రదర్శన, లౌడ్ స్పీకర్ల వాడకంపై కూడా పూర్తి నిషేధం విధించారు.

ఇస్లామాబాద్‌లో అన్ని ప్రధాన ప్రవేశ మార్గాలను దిగ్బంధించారు. రెడ్ జోన్ పూర్తిగా మూసివేశారు. మార్గల్లా రోడ్డు ద్వారా ఉద్యోగులు, అధికారులు, ఇతర సిబ్బందికి మాత్రమే ప్రవేశం ఉంది. ఈ చర్యల పట్ల టీఎల్పీ మండిపడుతోంది. పోలీసుల లాఠీఛార్జీలో తమ కార్యకర్త ఒకరు మరణించారని, 20 మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది. టీఎల్‌పీ అధినేతను అరెస్టు చేసేందుకు లాహోర్‌లోని యతీమ్ ఖానాలోని టీఎల్‌పీ ప్రధాన కార్యాలయంపై పోలీసులు దాడి చేశారని, అయితే వారిపై దాడి జరిగిందని అధికారి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+