• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సోషల్ మీడియా స్టార్ దారుణ హత్య: పరువు కోసం అంత నీచంగానా..

|

ముల్తాన్: పాకిస్థాన్‌లో సంచలనం సృష్టించిన రెండేళ్ల క్రితం(2016, జులై)నాటి సోషల్ మీడియా స్టార్ కండీల్ బలోచ్(26) పరువు హత్య కేసులో నిందితుడు, బాధితురాలి సోదరుడికి శుక్రవారం జీవిత ఖైదు విధించి అక్కడి కోర్టు. అందాల్ని ఆరబోస్తూ తీసుకున్న సెల్ఫీలతో కండీల్ బలోచ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

అనతి కాలంలోనే..

అనతి కాలంలోనే..

సోషల్ మీడియా ద్వారా అతి తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీని కండీల్ బలోచ్ సొంతం చేసుకుంది. ఫేస్‌బుక్‌లో ఎప్పుడూ ప్రత్యేకమైన ఫొటోలు, వీడియోలను పోస్టు చేసి అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకునేది ఈ అందాల రాశి. అయితే, బలోచ్ చేస్తున్న ఫేస్ బుక్ పోస్టులు, వీడియోలపై ఆమె సోదరుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేవాడు.

సోదరుడు హెచ్చరించినా..

సోదరుడు హెచ్చరించినా..

అనేకసార్లు ఆమెను వద్దంటూ హెచ్చరికలు కూడా చేశాడు. అయినా ఆమె తన సోదరుడి మాటలను పట్టించుకోలేదు. వాలెంటైన్స్ డే సందర్భంగా కండీల్ బలోచ్ స్కార్లెట్ డ్రెస్ ధరించి.. వీడియో మెసేజ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతేగా, పాశ్చాత్య సంస్కృతిని విమర్శిస్తున్న అప్పటి పాక్ అధ్యక్షుడిపై మండిపడుతూ వ్యాఖ్యలు చేశారు. దీనికి 70వేల మంది లైక్స్ కొట్టడం గమనార్హం.

అందుకే చంపానంటూ..

అందుకే చంపానంటూ..

తన సోదరి తన మాటను పెడచెవిన పెట్టడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కండీల్ బలోచ్ సోదరుడు.. ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు సోదరుడు మహ్మద్ వసీమ్. మోడలింగ్ పేరుతో అసభ్యకర ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోందన్న కారణంతోనే చంపినట్లు అతడు అంగీకరించాడు. మా అక్క మా ఇంటి పరువును బజారుకు ఈడ్చిందని, తాను సహించలేకపోయానని.. అందుకే ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నట్లు వసీమ్ తెలిపాడు. ఈ హత్య చేసింది తానొక్కడినేనని, తన మరో సోదరుడి హస్తం లేదని చెప్పుకొచ్చాడు.

ఆ దుర్మార్గుడికి జీవిత ఖైదు..

ఆ దుర్మార్గుడికి జీవిత ఖైదు..

కాగా, ఆమె హత్యతో ప్రపంచం నలుమూలల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. మహిళలకు రక్షణ లేదంటే పాకిస్థాన్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మహ్మద్ వసీమ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టు ముందు హాజరుపర్చారు. కాగా, నిందితుడు వసీమ్‌కు కోర్టు జీవిత ఖైదు విధించిందని అతని తరపు లాయర్ తెలిపారు. ఇది ఇలా వుంటే, తన కొడుకు అమాయకుడని అతని తల్లి చెబుతోంది. అయితే, అతని తండ్రి మాత్రం తన కూతురును చంపిన వాడ్ని ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చిపారేయాలని వ్యాఖ్యానించారు.

English summary
The brother of Pakistani social media star Qandeel Baloch was on Friday convicted of her murder and sentenced to life in prison in the patriarchal country's highest-profile "honour killing".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X