పాకిస్తాన్‌కు వింత కష్టం.. కండోమ్స్‌పై కూడా పన్ను తగ్గించనివ్వని IMF!
దాయాది దేశమైన పాకిస్థాన్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం ఏ స్థాయికి చేరిందంటే తమ దేశంలో జనాభా పెరుగుదలను అరికట్టేందుకు అవసరమైన కనీస గర్భనిరోధక సాధనాలపై పన్ను తగ్గించే స్వేచ్ఛ కూడా ఆ దేశానికి లేకుండా పోయింది. అప్పుల ఊబిలో ఉన్న పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) చుక్కలు చూపిస్తోంది. జనాభా పెరిగిపోతోందని కనీసం కండోమ్స్, గర్భనిరోధక సాధనాల మీదైనా 18 శాతం జీఎస్టీని తగ్గించాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన అభ్యర్థనను ఐఎంఎఫ్ తిరస్కరించింది. ఐఎంఎఫ్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ సర్కారు గతంలో ప్రవేశపెట్టిన కొన్ని "మినీ బడ్జెట్ల" ద్వారా గర్భనిరోధక సాధనాలపై 18 శాతం విక్రయ పన్నును విధించింది. దీనివల్ల కండోమ్స్, ఇతర కుటుంబ నియంత్రణ సాధనాల ధరలు, శానిటరీ ప్యాడ్లు, డైపర్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో పేద, మధ్యతరగతి ప్రజలు వీటిని కొనలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వయంగా చొరవ తీసుకుని ఈ పన్నును రద్దు చేయాలని కోరినా.. ఐఎంఎఫ్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది.

ఐఎంఎఫ్ ఎందుకు నో చెప్పింది?
పాకిస్తాన్ ఇప్పటికే ఐఎంఎఫ్ నుంచి భారీగా రుణాలు తీసుకుంది. ఈ క్రమంలో ఆదాయ సేకరణపై కఠిన నిబంధనలు ఉన్నాయి. పన్ను రాయితీలు ఇస్తే ప్రభుత్వ ఆదాయం సుమారు 40-60 కోట్లు తగ్గుతుందని, ఇది ప్రస్తుత ఆర్థిక లక్ష్యాలను దెబ్బతీస్తుందని ఐఎంఎఫ్ పేర్కొంది. పన్ను మార్పులేవైనా ఉంటే వచ్చే బడ్జెట్ సమయంలోనే చూసుకోవాలని, ఇప్పుడు కుదరదని స్పష్టం చేసింది. ఇలాంటి వాటిపై పన్ను తగ్గిస్తే స్మగ్లింగ్ పెరిగే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది.
ఐఎంఎఫ్ కఠిన నిబంధనలు.. ఆదాయమే ముఖ్యం
వాషింగ్టన్‌లోని ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయంతో పాకిస్థాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ జరిపిన చర్చల్లో పన్ను రాయితీ ప్రతిపాదనను పెట్టింది. అయితే ఐఎంఎఫ్ ఆ ప్రతిపాదనను నిష్పక్షపాతంగా తిరస్కరించింది. దానికి ఐఎంఎఫ్ ప్రధాన కారణాలను కూడా చెప్పింది. పాకిస్థాన్ ఈ ఏడాది 13.979 ట్రిలియన్ రూపాయల పన్ను వసూలు చేయాల్సి ఉంది. గర్భనిరోధక సాధనాలపై పన్ను తీసేస్తే సుమారు 400-600 మిలియన్ రూపాయల ఆదాయం తగ్గుతుందని ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఆర్థిక సంవత్సరం మధ్యలో ఇలాంటి పన్ను మినహాయింపులు ఇవ్వడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతింటుందని, ఏదైనా మార్పు ఉంటే 2026-27 బడ్జెట్ వరకు వేచి చూడాలని స్పష్టం చేసింది. ఒక్క వస్తువుపై పన్ను తగ్గిస్తే, రేపు మరిన్ని వస్తువులపై రాయితీలు అడుగుతారన్నది ఐఎంఎఫ్ భయం. అందుకే శానిటరీ ప్యాడ్లు, బేబీ డైపర్లపై కూడా రాయితీలు ఇవ్వడానికి నిరాకరించింది.
జనాభా విస్ఫోటనం - పెను సవాలు
ప్రస్తుతం పాకిస్తాన్ జనాభా వృద్ధి రేటు 2.55 శాతం వద్ద ఉంది, ఇది ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేట్లలో ఒకటి. ప్రతి సంవత్సరం దాదాపు 60 లక్షల మంది కొత్తగా జనాభాకు తోడవుతున్నారు.తగినంత గర్భనిరోధక సాధనాలు అందుబాటులో లేకపోతే అనవసర గర్భధారణలు పెరిగి, తద్వారా విద్య, వైద్యం, ఆహార వనరులపై విపరీతమైన భారం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇతర ఆర్థిక పర్యవసానాలు
పాకిస్తాన్ ఇప్పటికే తన ప్రభుత్వ ఎయిర్‌లైన్స్ (PIA) ను ప్రైవేటీకరించడం ద్వారా నిధులు సమకూర్చుకోవాలని చూస్తోంది. ఐఎంఎఫ్ నుంచి ఇప్పటివరకు 3.3 బిలియన్ డాలర్లు పొందిన పాక్, భవిష్యత్తులో మరిన్ని నిధుల కోసం వారి ప్రతి నిబంధనను తలొగ్గి పాటించాల్సి వస్తోంది. ప్రజారోగ్యం కంటే ఆర్థిక లక్ష్యాలకే ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితిలో పాక్ ప్రభుత్వం చిక్కుకుంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications