ఘోర ఆత్మాహుతి దాడి: 11 మంది దుర్మరణం, 30 మందికి తీవ్ర గాయాలు!
వాయవ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ పరిధిలోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో శనివారం ఓ ఘోర ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఉన్న పోలీస్ చెక్‌పోస్ట్ లక్ష్యంగా ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని పేల్చేశాడు. ఈ భయంకరమైన దాడిలో దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు, సహాయక బృందాలు వెల్లడించాయి. దారాజిందా ప్రాంతంలో జరిగిన ఓ వేడుక సమీపంలో ఈ ఘోరం జరిగింది.
పేలుడు జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. తీవ్రంగా గాయపడిన వారి వెంటనే ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు, సహాయక సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ భీకర దాడి వెనుక ఉగ్రవాద హస్తం ఉన్నట్లు అనుమానిస్తుండగా.. ఈ పేలుడుకు తామే బాధ్యులమని 'తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్'(టీటీపీ) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. సమాచారం అందుకున్న పాకిస్తాన్ భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని మరిన్ని దాడులు జరగకుండా దిగ్బంధించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో ఈ నెలలో వరుసగా భద్రతాపరమైన ముప్పులు, దాడులు పెరిగిపోయాయని, వీటన్నింటి వెనుక టీటీపీ హస్తం ఉందని అధికారులు చెబుతున్నారు.
వారం రోజుల క్రితం కూడా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కోహాట్ జిల్లాలో ఉగ్రవాదులు సరిహద్దు సమీపంలోని మసీదు లక్ష్యంగా వాహన బాంబు దాడికి పాల్పడ్డారు. పోలీస్ కార్యాలయాల సముదాయం సమీపంలో జరిగిన ఈ పేలుడు దాటిలో మసీదు ధ్వంసమవ్వడమే కాకుండా 15 మంది పోలీసు అధికారులతో సహా 21 మంది మరణించారు. 78 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Pakistan: Aman Mela Checkpoint, Darazinda: More than 10 reportedly KIA and over a dozen injured in a suicide attack. The checkpoint was reportedly destroyed. Unconfirmed. pic.twitter.com/Q7O4JzNZRV
— SILENT BRIEF (@SilentBriefHQ1) September 26, 2026














Click it and Unblock the Notifications
