వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చిన పాకిస్థాన్: ద్వైపాక్షిక చర్చలు రద్దు చేసుకున్న దాయాది !

అమెరికాకు ఝలక్ ఇచ్చిన పాకిస్థాన్, ఉగ్రవాదం ఉందంటారా ? డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేసిన దాయాది పాక్ ఇస్లామాబాద్ పర్యటనలు వాయిదా వేసుకున్న అమెరికా

|
Google Oneindia TeluguNews

Recommended Video

Donald Trump Doesn't Care About Kansas Shootout : Srinivasan Kuchibhotla - Oneindia Telugu

ఇస్లామాబాద్: అగ్రదేశం అమెరికాకు దాయాది పాకిస్థాన్ ఝలక్ ఇచ్చింది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ప్రతీకారంగా పాకిస్థాన్ అమెరికా పర్యటనలు మొత్తం రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది.

అఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ పై అమెరికా విధాన ప్రకటన సందర్బంగా పాకిస్థాన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు నిరసనగా తమ పర్యటనలు రద్దు చేసుకున్నామని పాక్ సెనేట్ కమిటీకి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసీఫ్ తెలిపారని ఆదేశంలోని ద నేషన్ పత్రిక తెలిపింది.

Pakistan suspends talks with United States (US)

పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా ఆసీఫ్ గత వారం అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. చివరి నిమిషయంలో ఖవాజా ఆసీఫ్ తన అమెరికా పర్యటన రద్దు చేసుకున్న సమయంలో ఆయన మాటలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కరాచీలో అమెరికాకు వ్యతిరేకంగా ప్రస్తుతం ఆందోళనలు జరుగుతున్నాయి.

అమెరికా సీనియర్ అధికారి, దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక ఉప ప్రధాన కార్యదర్శి అలైస్ వెల్స్ ఇస్లామాబాద్ పర్యటన ఇదే సమయంలో వాయిదా పడింది. అఫ్ఘనిస్థాన్ లో అమెరికా పౌరులను దారుణంగా చంపుతున్న ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంగా మారిందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో అమెరికాతో సంబంధాలకు దూరంగా ఉంటున్నామని పాకిస్థాన్ అంటోంది.

English summary
Local media reports say Pakistan has decided not to interact with the US government on the basis of existing ties. Reports added Pakistani government sources as saying that future diplomatic communications with the US will not be held as a strategic partner and ally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X