ప్రపంచ బ్యాంక్ అప్పుకోసం పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ వేలం ..! రేసులో సైన్యం..!
అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్ ను గట్టెక్కించేందుకు అమెరికా వంటి దేశాల సిఫార్సుతో ప్రపంచ బ్యాంక్ చేస్తున్న సాయం కూడా అస్తవ్యస్త విధానాల కారణంగా ఆవిరైపోతోంది. ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన అప్పుల్ని సైతం తీర్చడంలో విఫలమవుతున్న పాకిస్తాన్ మళ్లీ కొత్త రుణాల కోసం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏకంగా తమ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ సంస్థ పీఐఏను వేలం వేయాలని నిర్ణయించింది.
తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్న పాకిస్తాన్ తాజాగా పలు జాతీయ సంస్దల్ని ప్రైవేటీకరణ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ బ్యాంక్ నుంచి కొత్తగా రుణాలు రుణాలు తీసుకునేందుకు వీలుగా పెడుతున్న షరతులకు తలూపక తప్పడం లేదు. దీంతో పాకిస్తాన్ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ (పీఐఏ)ను కూడా వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబర్ 23న వేలం వేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో పాల్గొనే వారి నుంచి ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు కోరుతోంది.

పాకిస్తాన్ ప్రభుత్వం 7 బిలియన్ డాలర్ల ప్రపంచ బ్యాంక్ బెయిల్ అవుట్ ప్యాకేజ్ పొందేందుకు కీలకమైన షరతు తీర్చేందుకు
ఇలా అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ ప్రైవేటీకరణకు సిద్దమవుతోంది. ఎయిర్ లైన్స్ పూర్తి నిర్వహణ నియంత్రణతో సహా ఇందులో 51 శాతం వాటాల్ని అమ్మేయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 8న ఎయిర్ లైన్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశమవుతోంది. ప్రపంచ బ్యాంక్ నుంచి తదుపరి ప్యాకేజ్ బిలియన్ డాలర్ల ఈఎఫ్ఎఫ్ తో పాటు 200 మిలియన్ డాలర్ల క్లైమేట్ ఫెసిలిటీ సాయం అందుకునేందుకు ఈ వేలానికి సిద్దమైంది.

మరోవైపు ఈ బిడ్డింగ్‌కు ముందస్తు అర్హత పొందిన నాలుగు కంపెనీలలో సైనిక నియంత్రణలో ఉన్న ఫౌజీ ఫౌండేషన్‌లో భాగమైన ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ కూడా ఉంది. ఈ సంవత్సరం ప్రైవేటీకరణ ద్వారా రూ.86 బిలియన్లు అర్జించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయంలో 15 శాతం ప్రభుత్వానికి వెళ్లనుంది. మిగిలినది కంపెనీలోనే ఉందని పాకిస్తాన్ ప్రైవేటీకరణ మంత్రి ముహమ్మద్ అలీ తాజాగా వెల్లడించారు.












Click it and Unblock the Notifications