పాక్: జీన్స్ వేసుకున్న అమ్మాయిలకు జరిమానా
ఇస్లామాబాద్: జీన్స్ ధరించినందుకు పాకిస్తానీ విశ్వవిద్యాలయం అమ్మాయిలకు జరిమానా విధించింది. విశ్వవిద్యాలయం ఆవరణలో జీన్స్ ధరించినందుకు ఆ జరిమానా విధించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
తప్పనిసరిగా విద్యార్థినులు విశ్వవిద్యాలయంలో దుపట్టా వేసుకోవాలని జాతీయ శాస్త్ర, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఎన్‌యుఎస్‌టి) నిబంధన విధించింది. అదే సమయంలో జీన్స్ ధరించడాన్ని నిషేధించింది. తాము సరైన దుస్తులు ధరించాలని మాత్రమే చెప్పామని విశ్వవిద్యాలయం అధికారులు అంటున్నారు.

దుపట్టా ధరించనందుకు లేదా జీన్స్ వేసుకున్నందుకు కనీసం ఏడుగురు విద్యార్థినులకు జరిమానా విధించినట్లు విశ్వవిద్యాలయం బోర్డుపై నోటీసు అతికించారు. అందుకు విద్యార్థినులకు 500 నుంచి వేయి పాకిస్తానీ రూపాయల వరకు జరిమానా విధించారు.
విశ్వవిద్యాలయం నిబంధనలు, వ్యవహారాలు చాలా కఠినంగా ఉంటాయి. ముఖ్యమైన పరిపాలనా వ్యవహారాలు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ల చేతులోనే ఉన్నాయి. ఆడ, మగ విద్యార్థులు ఒక్క చోటు కూర్చోవడాన్ని అనుమతించరని, దాన్ని ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తారని డాన్ అనే పత్రిక రాసింది.












Click it and Unblock the Notifications