భారత్ పై న్యూక్లియర్ దాడులకు తెగించిన పాక్
వాషింగ్టన్: 1999 నాటి కార్గిల్ యుద్ధంలో భారత్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన పాకిస్థాన్ భారత్ మీద అణ్వాయుధాల (న్యూక్లియర్) తో దాడి చెయ్యాలని ప్రయత్నించిందని తాజాగా వెలుగు చూసింది. అయితే అమెరికా వారించడం వలన పాకిస్థాన్ వెనక్కి తగ్గిందని సమాచారం.
ఈ విషయాలను వైట్ హౌస్ రిటైర్డ్ అధికారి బ్రూస్ స్వయంగా వెల్లడించారు. ఇప్పటి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ 1999లో పాక్ ప్రధానిగా ఉన్నారు. నవాజ్ షరీఫ్ 1999 జులై 4వ తేదిన అమెరికా పర్యటనకు వెళ్లారు. అప్పటికే కార్గిల్ యుద్ధం జరుగుతున్నది.
అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తో నవాజ్ షరీఫ్ సమావేశం కావడానికి సిద్దం అయ్యారు. అదే సమయంలో సీఐఏ రోజువారి రహస్య సమాచారాన్ని నివేదించడంలో భాగంగా పాక్ అణు సన్నాహాలకు ప్రయత్నిస్తున్నదని బిల్ క్లింటన్ దృష్టికి తీసుకు వెళ్లింది.
అప్పటి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ దుస్సాహసానికి పాల్పడి కార్గిల్ ముట్టడికి ప్రయత్నించాడు. అయితే భారత్ ఆర్మీ బలగాలు ఆ దాడిని తిప్పికొడుతున్న సమయంలోనే నవాజ్ షరీఫ్ యుద్దాన్ని ఆపడం కోసం అమెరికాను ఆశ్రయించాడు.

కార్గిల్ యుద్దంలో ఓడిపోతే అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ పరువు పోతుందని ఉద్దేశంతోనే నవాజ్ షరీఫ్ సామరస్యంగా కార్గిల్ యుద్దాన్ని ముగించాలని భావించారని అప్పటి వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు ( ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు) బ్రూస్ రీడెల్ స్పష్టం చేశారు.
పాక్ అణ్వాయుధాలు వేయాలనుకుంటున్నదని తాము అప్పుడే బిల్ క్లింటన్ దృష్టికి తీసుకు వెళ్లామని వివరించారు. పాకిస్థాన్ ఈ యుద్ధాన్ని ప్రారంభించిన నేపధ్యంలో ఆదేశం ఎలాంటి పరిహారం కోరకుండానే ఆపేయాలని బిల్ క్లింటన్ కు తాము సూచించామని అన్నారు.
అలా చేస్తే తప్ప మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తవని క్లింటన్ కు బ్రూస్ రీడెల్, క్లింటన్ మాజీ భద్రతా సలహాదారుడు సాండీ బెర్జర్ అమెరికాకు సూచించారు. బుధవారం సాండీ బెర్జర్ క్యాన్సర్ వ్యాధితో మరణించిన విషయం తెలిసిందే. ఆయన ఆకస్మిక మృతి సందర్బంగా బ్రూస్ వ్రాసిన ఓ వ్యాసంలో ఈ వివరాలు వెల్లడించారు.












Click it and Unblock the Notifications