పరువు హత్యలు: మృతుల్లో నిండు గర్భిణీ, గుండు గీశారు

లాహోర్: పరువు హత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా పాకిస్థాన్ మారుతోంది. తాజాగా పాకిస్థాన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనల్లో మొత్తం ముగ్గురు మృతి చెందగా అందులో నిండు గర్భిణి ఉండటం విశేషం. తాజాగా పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఓ యువతి వేరే గ్రామానికి చెందిన వ్యక్తి ముస్లిం వ్యక్తిని ప్రేమించి, అతడితో లేచిపోయి పెళ్లి చేసుకుంది.

అనంతరం ఆ యువతి ఇస్లాం స్వీకరించడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. కొద్ది రోజులు గడచిన తర్వాత యవతికి ఫోన్ చేసిన తల్లిదండ్రులు భర్తతో కలిసి ఇంటికి రమ్మని ఆహ్వానించారు. స్వయంగా తల్లిదండ్రులే ఫోన్ చేసి పిలవడంతో శనివారం ఆమె పుట్టింటికి వెళ్లింది.

తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు గాను తండ్రి, సవతి తల్లి కలిసి ఆ యువతిని చిత్రహింసలు పెట్టి, ఆ తర్వాత పంచాయితీ వద్ద హాజరుపరిచారు. కుటుంబానికి పరువునష్టం కలిగించినందుకు ఆమెకు గుండు గీయించి, ముఖానికి నల్లరంగు పూసి గ్రామంలో ఊరేగించాలని శిక్ష విధిస్తూ పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పారు.

Pakistan woman paraded with blackened face, shaved head for eloping

దీంతో ఆ యువతికి ఆమె తల్లిదండ్రులు గుండు గీయించి, ముఖానికి నల్లరంగు పూసి గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటనలో బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 10మందిపై కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఎహసాన్ సాదిక్ తెలిపారు. ఈ కేసులో దర్యాప్తుని వేగవంతం చేశామని త్వరలోనే మిగతా నిందితులను పట్టుకుంటామన్నారు.

పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో పరువు హత్యల లాంటివి చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. గతేడాది పాకిస్థాన్‌లో 1100 మంది మహిళలను పరువుహత్యల కింద అత్యంత దారుణంగా చంపేశారు. ఇటీవలే జరిగిన మరో ఘటనలో మహమ్మద్ షకీల్(30), అతని భార్య నిండు గర్భిణి అయిన అక్సా(26)ను కుటుంబ సభ్యులు కాల్చి చంపారు.

నాలుగు సంవత్సరాల క్రితం పెద్దలను ఎదిరించి వీరు పెళ్లి చేసుకున్నారు. దీనిని సహించలేని అక్సా సోదరుడు తల్లి, మేనమామతో కలిసి సోదరి ఇంటికి వెళ్లి గొడవపడి తుపాకీతో కాల్చి చంపారు. అనంతరం మృతదేహాలను గుర్తు తెలియని ప్రాంతంలో పడేశారు.

ఓ కెనాల్‌లో వీరి మృతేదేహాలను గుర్తించిన పోలీసులు అక్సా మరో నాలుగు రోజుల్లో బిడ్డకు జన్మనిచ్చేదని, అంతలోనే ఈ ఘటన జరిగిందని మృతదేహాల స్వాధీనం అనంతరం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

ఇక రెండు రోజుల క్రితం తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు కన్న తల్లే గర్భిణి అయిన కుమార్తె(22)ను అత్యంత దారణంగా చంపేసింది. గతవారంలో 18 ఏళ్ల కుమార్తెను తల్లే సజీవంగా దహనం చేసిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+