దారుణం: తెలియకుండా నాలుగో పెళ్లి చేసుకొని నటిని కాల్చి చంపేశాడు
కరాచి: ఖైబర్ ఫక్తుంక్వాలో దారుణం జరిగంది. పాకిస్తాన్‌కు చెందిన నటి, గాయకురాలు రేష్మను నాలుగో పెళ్లి చేసుకున్న భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన నౌషెరా కలాన్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఆమెను భర్త చంపినట్లు పోలీసులు తెలిపారు. జియో టీవీ వివరాల మేరకు.. ఏడాది క్రితం రేష్మాకు ఖైబర్ పక్తుంఖ్వా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. అతనికి అప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. రేష్మాకు అంతకు ముందు పెళ్లిళ్ల విషయం చెప్పలేదు. చెప్పకుండానే నాలుగో వివాహం చేసుకున్నాడు.

ఈ విషయం ఇటీవల రేష్మాకు తెలిసింది. దీంతో భర్తతో గొడవపడింది. హకీమాబాదులో ఉంటున్న తన సోదరుడి వద్దకు వెళ్లిపోయింది. తనతో కలిసి కాపురం చేయడం లేదని రేష్మపై భర్తకు కోపం వచ్చింది. దీంతో హకీమాబాదులో ఆమె ఉంటున్న ఇంట్లోకి వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికి అక్కడే మృతి చెందింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications