హనీమూన్‌: భారత జంటను వీడియో తీసిన పాకిస్తానీ అరెస్ట్

దుబాయ్: హనీమూన్‌కు వెళ్లిన భారతీయ దంపతులు సన్నిహితంగా ఉన్న సమయంలో పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి రహస్యంగా వీడియోతీసి బ్లాక్‌మెయిల్‌ చేశాడు. దీంతో ఆ జంట పోలీసులను ఆశ్రయించడంతో అతడు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన దుబాయిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. నాలుగు రోజుల హనీమూన్‌ కోసం సదరు భారత జంట దుబాయ్‌కి వెళ్లింది. కారులో నగరమంతా చుట్టేశారు. కాగా, వారు సన్నిహితంగా ఉన్న సమయంలో కారు డ్రైవర్‌ రహస్యంగా మొబైల్ ఫోన్‌తో వీడియో తీశాడు. వారు కారు దిగి వెళ్లిపోయిన తర్వాత పాకిస్థాన్‌కు చెందిన 28ఏళ్ల ఆ డ్రైవర్‌ వాట్సాప్‌ ద్వారా వీడియోను ఆ జంటకు పంపాడు.

Pakistani Man Arrested For Filming Indian Couple Honeymooning In Dubai

అంతేగాక, 2000 దిర్హామ్‌లు (సుమారు రూ.36,500) ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. లేదంటే అతని భార్యనైనా ఇవ్వమన్నాడు. ఏమీ ఇవ్వకపోతే వీడియో సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తానని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. కాగా, భారతీయ వ్యక్తి మరో స్నేహితుడి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పథకం ప్రకారం అతడికి 'డబ్బు ఇస్తాం' రమ్మని హోటల్‌కు పిలిచారు. దీంతో అక్కడే కాపు కాసిన పోలీసులు ఆ పాకిస్థాన్‌ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఈ యేడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి జైలు శిక్ష విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+