కెనడాలో పాక్ స్కూల్: ఐఎస్ లో చేరిన విద్యార్థినిలు

టోరంటో: కెనడాలో ఉన్న పాకిస్థాన్ కు చెందిన ఓ పాఠశాల నుంచి వెళ్లిన నలుగురు అమ్మాయిలు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థలో చేరారని వెలుగు చూసింది. కెనడా ప్రభుత్వం ఈ విషయం గుర్తించడంతో ఆ పాఠశాలను పూర్తిగా మూసివేశారు.

పాక్ చెందిన పాఠశాలలో చదువు పూర్తి అయిన తరువాత నలుగురు అమ్మాయిలు ఉగ్రవాద సంస్థలో చేరడం మాకు షాక్ కు గురిచేసిందని, అందుకే వెంటనే ఆ స్కూల్ ను మూసి వెయ్యాలని ఆదేశాలు జారీ చేశామని కెనడా అధికారులు తెలిపారు.

పాకిస్థాన్ లోని ముల్తాన్ లో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పాకిస్థాన్ అల్-హుదా అనే పాఠశాల ఉంది. ఈ పాఠశాలకు కెనడాలో ఓ బ్రాంచ్ ఉంది. ఈ పాఠశాల బ్రాంచ్ ను కెనడాలో 2004లో ఇస్లామిక్ స్కాలర్ పర్హాత్ హష్మీ స్థాపించింది.

 Pakistani school’s Canada branch shut after girls went to join ISIS

గత వారం అమెరికాలోని కాలిఫోర్నియాలో కాల్పులకు తెగబడి 14 మంది బలి కావడానికి కారణం అయిన మహిళా ఉగ్రవాది తప్ఫీన్ మాలిక్ (27) కూడ పాకిస్థాన్ లోని అల్-హుదా స్కూల్ లోనే చదివిందని వెలుగు చూసిందని కెనడా అధికారులు చెప్పారు.

కెనడాలోని అల్-హుదా పాఠశాలలో 16 నుంచి 20 సంవత్సరాల వయస్సు ఉన్న నలుగురు అమ్మాయిలు వారి చదువు పూర్తి కాగానే నేరుగా వెళ్లి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరారని తమ దగ్గర పక్కా సమాచారం ఉందని అధికారులు తెలిపారు.

తమకు స్పష్టమైన ఆధారాలు లభించిన తరువాత ఆ పాఠశాలను మూసివేయించామని వివరించారు. కెనడా నుంచి వెళ్లిన నలుగురు అమ్మయిలలో ముగ్గురు టర్కీలో, ఒకరు సిరియాలో ఉన్నారని అధికారులు చెప్పారు.

చదువు పూర్తి చేసుకుని ఉగ్రవాద సంస్థలో చేరిన ఓ విద్యార్థిని సోదరి స్పందిస్తూ ఇది నిజంగా ఓ భయంకరమైన విషయం అని చెప్పింది. తన సోదరి చాల అపాయకరం, ఆమె దొరికితే కచ్చితంగా చంపేయాలని అంటున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+