Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"యుద్ధం వేళ.. భారత్ లో కలిసేందుకు ఆ దేశం రెడీ"

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా పాకిస్థాన్ వ్యవహారశైలి ఉంటుంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అవుతోంది. పాకిస్థాన్ లో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దాంతో అక్కడి ప్రభుత్వం ఈ విపత్తు నుంచి బయటపడేందుకు స్మార్ట్ లాక్ డౌన్ ను విధించింది. స్మార్ట్ లాక్ డౌన్ లో భాగంగా ఏప్రిల్ 7 నుంచి దేశంలోని చాలా ప్రాంతాల్లో మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌ ను రాత్రి 8 గంటలకే మూసివేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

ఇక మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా ఇదే సమయంలో తమ అప్పు కట్టాలని యూఏఈ దేశం పాకిస్థాన్ పీకల మీద కూర్చుంది. తమ నుంచి తీసుకున్న 3.5 బిలియన్ డాలర్ల మొత్తాన్ని వెంటనే చెల్లించాలని యూఏఈ ఆదేశాలు జారీ చేసింది. దాంతో ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి దిక్కుతోచని స్థితిలోకి మారింది. అయితే పాకిస్థాన్ లోని ఓ సెనేటర్ మాత్రం యూఏఈ దేశంలో సంచలన ఆరోపణలు చేశారు. యూఏఈ పై పాకిస్థాన్ నేతలు విషం చిమ్ముతున్నారు. పాకిస్థాన్ సెనేటర్ ముషాయిద్ హుసేన్ మాట్లాడుతూ.. యూఏఈ డబ్బు కోసం ఆరాట పడే ఓ పేద దేశం అని ఎద్దేవా చేశారు.

అయితే యూఏఈ కు పాకిస్థాన్ లోన్ చెల్లించడమే కరెక్ట్ అని ముషాయిద్ హుసేన్ పేర్కొన్నారు. యూఏఈ దేశాన్ని భారత్ భయపెట్టిందని కీలక ఆరోపణలు చేశారు. యూఏఈని అఖండ భారత్ లో కలిపేసుకుంటామని ఆ దేశాన్ని భయపెట్టిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే పాకిస్థాన్ పై యూఏఈ దుందుడుగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. పాకిస్థానీ టీవీ ఛానెల్ అయిన దునియా న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

Pakistani Senator Mushahid Hussain Warns UAE Friendly Ties with India May Lead to Akhand Bharat

"యూఏఈ లోన్ ను తీర్చేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అంగీకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. యూఏఈలోని మా బ్రదర్స్ కు డబ్బు అవసరం బాగా ఉంది. అందువల్ల వారి డబ్బును వారికే ఇవ్వడం సమంజసం" అంతేకాక పాకిస్థాన్.. యూఏఈ కు పెద్ద అన్న లాంటిది అని తెలిపారు. గతంలో తాము పాకిస్థాన్ కు చాలా హెల్ప్ చేశామని.. ఆ దేశ నిర్మాణంలో తమ పాత్ర ఎంతో ఉందని ముషాయిద్ హుసేన్ పేర్కొన్నారు. యూఏఈ ఆర్మీని ట్రైన్ చేయడంలో తమ పాత్ర ఎంతో ఉందని అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+