పెళ్లికి నో చెప్పాడని ప్రియుడి పైన యాసిడ్ పోసింది
లాహోర్: పాకిస్తాన్‌లో మహిళల పైన ఆంక్షలు, మత నమ్మకాలు, వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పెళ్లికి అంగీకరించలేదని లేదా ప్రేమకు అంగీకరించలేదని యువకులు యువతుల పైన యాసిడ్ పోసిన సందర్భాలు మనం చాలానే చూశాం.
కానీ పాకిస్తాన్‌లోని ఓ ప్రాంతంలో ఓ మహిళ పెళ్లికి అంగీకరించలేదనే కారణంతో వ్యక్తి పైన యాసిడ్ పోసింది. ప్రేమించి, పెళ్లికి నో చెప్పాడని ఆ మహిళకు కోపం వచ్చింది. ఆవేశంలో ఆమె ఆ ప్రియుడి పైన యాసిడ్‌ను చల్లింది.
బాయ్‌ఫ్రెండ్‌పై యాసిడ్ చల్లిన యువతిని మోమెల్ మాయిగా గుర్తించారు. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. యాసిడ్ దాడి వల్ల గాయపడ్డ వ్యక్తిని సాదక్త్ అలీగా నిర్ధారించారు. చాలా రోజులుగా ఇద్దరి మధ్య సంబంధం ఉన్నట్లు పోలీసలు గుర్తించారు.

పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో ఈ సంఘటన జరిగింది. యాసిడ్ దాడి వల్ల అలీ దేహాం దాదాపు యాభై శాతం వరకు కాలిపోయింది. సాధారణంగా పాకిస్థాన్‌లో ప్రతి ఏడాది వందల సంఖ్యలో యాసిడ్ దాడులు జరుగుతాయి. కానీ అబ్బాయిపై ఓ మహిళ దాడి చేయడం పెను సంచలనం రేపింది.
ఇంట్లో స్నానం చేసి బయటకు వచ్చిన అలీపై సదరు మహిళ యాసిడ్ దాడి చేసింది. దాడిలో అతని వీపు భాగంపై ఆమె యాసిడ్ చల్లినట్లు పోలీసులు తెలిపారు. వాస్తవానికి ఇద్దరూ వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే మాయి తన భర్తకు విడాకులు ఇచ్చి అలీని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అతను పెళ్లికి నో చెప్పడంతో ఆ మహిళ యాసిడ్‌తో దాడి చేసిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications