విమానంలో దారుణంగా కొట్టుకున్నారు, వీడియో హల్‌చల్

Posted By:
Subscribe to Oneindia Telugu

టోక్యో: విమానం టేకాఫ్‌ కావడానికి కొద్ది సమయం ముందు ఇద్దరు ప్రయాణికులు ఒకరిపై మరొకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. ఈ సంఘటన జపాన్‌ రాజధాని టోక్యోలోని విమానాశ్రయం నుంచి అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌కు వెళ్లాల్సిన ఆల్‌ నిప్పాన్‌ ఎయిర్‌వేస్ (ఏఎన్‌ఏ)లో చోటుచేసుకుంది.

మద్యం సేవించిన ఉన్న ఓ అమెరికన్‌ వ్యక్తి.. మరో ప్రయాణీకుడిపై దాడికి దిగాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కొట్టుకున్నారు. విమానంలోనే దారుణంగా పిడుగుద్దులు కురిపించుకున్నారు.

flight

గొడవపడిన ప్రయాణికుల పేర్లు వెల్లడించేందుకు విమానాశ్రయ అధికారులు నిరాకరించారు. నిన్ను చంపేస్తానంటూ.. నల్ల రంగు టీషర్టు ధరించిన వ్యక్తి ఎరుపు రంగు చొక్కా వ్యక్తిపై పిడిగుద్దులతో దాడి చేశాడు. వారి మధ్య గొడవ ఎందుకు జరిగిందనే విషయం మాత్రం బయటికి రాలేదు.

ఈ తతంగాన్నంతా విమానంలో ఉన్న మరో ప్రయాణికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్‌గా మారింది. వాళ్లిద్దరి గొడవ వల్ల విమానం దాదాపు గంట పాటు ఆలస్యమైంది. వారిని పోలీసులకు అప్పగించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A fight between two men erupted on a flight from Japan that was bound for Los Angeles, and the incident was captured on video.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి