• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చివరిక్షణాలు: మేడే..మేడే..పాకిస్తాన్8303.. ఇళ్లపై కూలిన విమానం..ఉగ్రకోణం? ప్రధాని మోదీ సంతాపం..

|

భయం నిండిన గొంతుతో పైలట్ చెబుతున్నాడు.. ''సార్.. దిసీజ్ పీకే8303.. మా రెండు ఇంజన్లూ ఫెయిలైపోయాయి.. ఎడమ వైపు నుంచి డైరెక్ట్ గా అప్రోచ్ అవుతున్నాం.. రోజర్.. సార్.. మేడే.. మేడే.. పాకిస్తాన్ 8303''.... ఆ తర్వాత కిర్రుమనే రేడియో తరంగాలు తప్ప పైలట్ గొంతు వినిపించలేదు. ఇటువైపు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) నుంచి ''పీ8303 రోజర్.. ల్యాండ్ అయ్యేందుకు రెండు రన్ వేలు రెడీగా ఉన్నాయి..'' అనే సందేశం అందుకునేలోపే.. ఎయిర్ పోర్టు పక్కనున్న ఇళ్లపై విమానం కుప్పకూలిపోయింది...

అతి పెద్ద ప్రమాదం..

అతి పెద్ద ప్రమాదం..

పాకిస్తాన్ చరిత్రలోనే అతి ఘోర ప్రమాదంగా భావిస్తోన్న ఘటన శుక్రవారం కరాచీలో చోటుచేసుకుంది. ‘పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)కు చెందిన ఎయిర్‌బస్ జెట్‘ఏ-320' విమానం(సర్వీస్ నంబర్ పాకిస్తాన్8303) జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు సమీపంలోని మోడల్ కాలనీలో కుప్పకూలింది. లాహోర్ నుంచి 99 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది కరాచీ చేరిన విమానం.. ల్యాండ్ కావడానికి కొద్ది నిమిషాల ముందు ఈ దుర్ఘటన జరిగింది.

ఎప్పుడూ చూడని ఘోరం..

ఎప్పుడూ చూడని ఘోరం..

ఇంకొద్ది రోజుల్లో రానున్న రంజాన్ పండక్కి రెడీ అవుతోన్న మోడల్ కాలనీ వాసులు ఎప్పుడూ చూడని ఘోరాన్ని చవిచూశారు. కరాచీ ఎయిర్ పోర్టు రన్‌వే కు కూతవేటు దూరంలో ఉన్న ఈ కాలనీపైనే విమానం కూలిపోయింది. అప్పటికే రెండు సార్లు ల్యాండ్ అయ్యేందుకు విఫలయత్నం చేసిన పైలట్.. విమానం రెండు ఇంజన్లూ దెబ్బతిన్నాయని, మూడోసారి ఎడమవైపు నుంచి ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నిస్తామని ఏటీసీతో సంభాషించిన ఆడియోను అధికారులు మీడియాకు విడుదల చేశారు. అదుపుతప్పిన విమానం కాలనీవైపు దూసుకొచ్చి, ముందుగా సెల్ ఫోన్ టవర్ ను ఢీకొట్టిందని, చూస్తుండగానే ఓ గల్లీలోని ఇళ్లపై అమాంతం పడిపోయిందని, విమానం నేలకూలగానే మంటలు, దట్టమైన పొగ చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

భారీగా మృతులు..

భారీగా మృతులు..

ప్రమాద సమయంలో విమానంలో 107 మంది ఉండగా, అది కూలిపోయిన ఇళ్లలో ఎంత మంది ఉన్నారనేది ఇంకా తెలియలేదు. ప్రాధమిక అంచనాను బట్టి వంద మందికిపైనే చనిపోయి ఉంటారని సివిల్ ఏవియేషన్ అధికారులు, కరాచీ మేయర్, పోలీసులు తెలిపారు. ప్రమాదంలో విమానంతోపాటు ఇళ్లు కూడా పూర్తిగా ధ్వంసమైపోవడంతో మృతదేహాల వెలికితీత ఇబ్బందికరంగా మారింది. రంగంలోకి దిగిన ఆర్మీ, ఇతర బలగాలు సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. విమానంలో ప్రయాణించిన వాళ్లలో మహిళలు, చిన్నపిల్లల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని, ధ్వంసమైన ఇళ్లలోనూ ఆడవాళ్లు, చిన్నారులే ఉండే అవకాశముందని తెలుస్తోంది.

అదృష్టవశాత్తూ..

అదృష్టవశాత్తూ..

కాగా, విమానం తక్కువ ఎత్తు నుంచి కూలిపోవడంతో లోపలున్నవాళ్లలో కొందరు ప్రాణాలతో బయటపడ్డారని, వారిలో బ్యాంక్ ఆఫ్ పంజాబ్ సీఈవో జాఫర్ మసూద్, న్యూస్ 24 డైరెక్టర్ అన్సార్ నఖ్వీ కూడా ఉన్నారని అధికారులు చెప్పారు. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 15 మృతదేహాలను వెలికితీయగా.. శిధిలాల కింద చిక్కుపోయిన మరో 16 మందిని ఆస్పత్రులకు తరలించారు. విమాన ప్రమాదం నేపథ్యంలో కరాచీ సిటీలో హెల్త్ ఎమర్జెన్సీ విధించారు.

ప్రధాని మోదీ, రాహుల్ సంతాపం..

ప్రధాని మోదీ, రాహుల్ సంతాపం..

పాకిస్తాన్ లో ఘోర విమాన ప్రమాద ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొంతుతున్నవాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా పాక్ విమాన ప్రమాద మృతులకు సంతాపం తెలిపారు. శిధిలాల నుంచి చాలా మంది ప్రాణాలతో బయటపడుతుండటం ఆశ రేపుతున్నదని, వారంతా త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. భారత్ నుంచి పలువురు ప్రముఖులు, సామాన్యులు సైతం పాక్ విమాన ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.

  Deer Chased By A Leopard, Crashes Through Roof Of Mumbai House
  ఉగ్రకోణం?

  ఉగ్రకోణం?

  కరాచీ ఎయిర్ పోర్టుకు సమీపంలోని జనావాసాలపై కూలిపోయిన ఎయిర్ బస్ ఏ320 కండిషన్ పై తీవ్రమైన చర్చ నడుస్తోంది. ‘‘రెండు ఇంజన్లూ ఫెయిల్ అయిపోయాయి.. ''అంటూ ఏటీసీతో పైలట్ జరిపిన సంభాషణపై వైరలైంది. కాలనీవైపు దూసుకొచ్చిన సమయంలో విమానం రెండు రెక్కలూ(ఇంజన్లూ) మండిపోతూ కనిపించాయిని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇంజన్లు ఫెయిల్ కావడానికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. మంచి కండిషన్ లో ఉన్న విమానం అకస్మాత్తుగా ప్రమాదానికి గురికావడంలో ఉగ్రకోణం ఏదైనా ఉందా? అనే దిశలోనూ ఎంక్వైరీ చేస్తారని పాక్ మీడియా పేర్కొంది. ఎయిర్ బస్ ఏ320 పీఐఏ కొనుగోలు చేయడానికి ముందు.. అంటే, 2004 నుంచి 2014దాకా చైనాకు చెందిన ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్ కంపెనీ నడిపించినట్లుగా వెల్లడైంది.

  English summary
  PIA Crash:rescue for survivors, Cockpit Audio out, PM Modi extends condolence
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X