వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లావు: మహిళను అవమానించిన పిజ్జా హట్ క్షమాపణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

సింగపూర్: ఓ మహిళా కస్టమర్‌ను 'పింక్ ఫ్యాట్ లేడీ'గా పేర్కొన్నందుకు ఓ సింగపూర్ పిజ్జా హట్ క్షమాపణలు కోరింది. పిజ్జా కోసం వచ్చిన యువతికి చెందిన బిల్లు రిసిప్ట్ పైన ఆమెను గుర్తించేందుకు 'పింక్ ఫ్యాట్ లేడీ'గా పేర్కొన్నారు. దీని పైన ఆమె తన అసంతృప్తిని సామాజిక అనుసంధాన వెబ్‌సైట్ ద్వారా వ్యక్తం చేసింది. దీంతో సదరు పిజ్జా హట్ క్షమాపణలు కోరారు.

అయిలీ సి అనే మహిళ ఆదివారం పిజ్జా హట్ సింగపూర్ ఫేస్‌బుక్ పేజీ పైన.. రిసిప్ట్ ఫోటోను ఉంచి, తనను గుర్తించేందుకు అవమానకరంగా వ్యవహరించారని ఆమె అందులో పేర్కొన్నారు.

'నన్ను గుర్తించేందుకు మీ స్టాఫ్ రిసిప్ట్ పైన అలా రాయడం (పింక్ ఫ్యాట్ లేడీ) సరికాదని' ఆమె పేర్కొన్నారు. ఆ రిసిప్ట్ కింద చేతి రాతతో 'పింక్ ఫ్యాట్ లేడీ' అని ఉంది. ఆమెను గుర్తించేందుకు స్టాఫ్ అలా రాశారు.

Pizza Hut apologizes for 'Pink Fat Lady' customer tag on receipt

ఓ కస్టమర్‌గా తాను కనీస గౌరవం ఉంటుందని భావించానని, తనను అలా పేర్కొన్నందుకు (పింక్ ఫ్యాట్ లేడీ) పిజ్జా హట్ నుండి, స్టాఫ్ నుండి క్షమాపణలు ఆశిస్తున్నానని పేర్కొన్నారు. తనను అలా పేర్కొన్నందుకు తాను అవమానకరంగా భావించానని పేర్కొన్నారు. తాను లావుగా ఉండటం తప్పా అని ప్రశ్నించారు.

తాను కూడా అందరిలా ఓ కస్టమర్‌ను అని, పిజ్జా కోసం అందరిలాగే తాను డబ్బులు ఇస్తున్నానని, పిజ్జాను వారి నుండి ఉచితంగా తీసుకోవడం లేదని ఘాటుగా ఆ పేజీలో రాశారు.

అనంతరం పిజ్జా హట్ క్షమాపణలు కోరింది. అంతేకాదు, పింక్ ఫ్యాట్ లేడీగా పేర్కొన్నందుకు.. అలా రాసిన వారి పైన చర్యలకు ఉపక్రమించింది.

ఈ సంఘటన తమకు చాలా బాధాకరమని, ఇది తమ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉందని, అలా రాసిన వారిని తాము ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని, వారి పైన చర్యలు తీసుకుంటామని మేనేజ్‌మెంట్, స్టాఫ్ పేరుతో ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. కాగా, మహిళను అలా పేర్కొన్నందుకు ఫేస్‌బుక్‌లో పలువురు విమర్శలు గుప్పించారు. ఇంకొందరు సూచనలు చేశారు.

'పింక్ ఫ్యాట్ లేడీ' అనే బదులుగా సదరు పిజ్జా హట్ స్టాఫ్ 'లేడీ ఇన్ పింక్' అంటే బావుండేదని ఒకరు అభిప్రాయపడ్డారు. మరొకరు అయితే, మహిళను అవమానపర్చినందుకు గాను ఆమెకు సదరు పిజ్జా హట్ జీవితాంతం ఆమెకు పిజ్జాను ఉచితంగా ఇవ్వాలని సూచించారు.

English summary
Pizza Hut Singapore has launched an investigation and apologized to a customer described as a "Pink Fat Lady" in a handwritten note on her receipt after she ordered pizza for take-away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X