Plane Crash: ఘోర ప్రమాదం.. గాలిలోనే విమానం, హెలికాప్టర్ ఢీ
Plane Crash: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో పెను విమాన ప్రమాదం సంభవించింది. రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక ప్రయాణీకుల విమానం, హెలికాప్టర్ గాల్లోనే పరస్పరం ఢీకొన్నాయి. ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతుండగా ఢీకొని రెండూ పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ఆ సమయంలో విమానం 64 మందితో వెళ్తున్నట్లు తెలిసింది. బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వెంటనే ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పోటోమాక్ నదిలో రెస్క్యూ బోట్లు సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి. ప్రమాదం తర్వాత రోనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయాన్ని అత్యవసర ఆదేశం ప్రకారం మూసివేశారు.
పీఎస్ఏ ఎయిర్ లైన్స్ ప్రయాణికుల విమానం కాన్సాస్ లోని విషిటా నుంచి బయలుదేరి.. వాషింగ్టన్ సమీపంలోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్టు రన్ వేపై ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమవుతుండగా.. గాల్లోనే రక్షణ శాఖకు చెందిన సికోర్స్కీ హెచ్-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్ ను ఢీకొట్టింది. ఈ మేరకు యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గురైన విమానం అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందినది. గగనతలంలో ఈ ప్రమాదం జరిగిన సమయంలో భారీ శబ్ధం వినిపించింది.

ఈ ప్రమాద సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు ఎయిర్ లైన్స్ ప్రకటించింది. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది నదిలో సహాయక చర్యలను చేపట్టారు. నదిలో మునిగిపోయిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ప్రయాణీకులు విమానాన్ని ఢీకొన్న హెలికాప్టర్ యూఎస్ సైన్యానికి చెందినదని కాన్సాస్ కు చెందిన యూఎస్ సెనేటర్ రోజర్ మార్షల్ తెలిపారు.
Video appears to show Two Aircraft, a Helicopter and Commercial Airliner, colliding earlier at Ronald Reagan Washington National Airport near D.C pic.twitter.com/ZJo0wyGbpp
— OSINTdefender (@sentdefender) January 30, 2025












Click it and Unblock the Notifications