జిల్ బైడెన్‌తో మోదీ: అమెరికాలో చదువుకొనే భారత విద్యార్థుల కోసం కీలక నిర్ణయాలు
వాషింగ్టన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా మలి మజిలీకి చేరుకున్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి లాన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ఆయన అక్కడి నుంచి నేరుగా వాషింగ్టన్‌కు బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపటి కిందటే వాషింగ్టన్‌లోని జాయింట్ ఎయిర్ బేస్ ఆండ్రూస్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు.
మోదీ గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆయనకు తన అధికారిక నివాసం వైట్ హౌస్‌లో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇవ్వాళ వైట్‌హౌస్‌లో ఈ విందు ఏర్పాటు కానుంది. అమెరికన్ జాయింట్ కాంగ్రెస్‌ను సైతం ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. జాయింట్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించబోతోండటం మోదీకి ఇది రెండోసారి. ఈ రెండు కార్యక్రమాలను అమెరికా ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

కాగా- జాయింట్ ఎయిర్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయంలో మోదీ ల్యాండ్ అయ్యే సమయానికి భారీ వర్షం కురిసింది. ఆయన కోసం అధికారులు గొడుగులను సిద్ధం చేశారు. అయినప్పటికీ.. ఆయన వాటిని వినయోగించలేదు. గొడుగు లేకుండా వర్షంలో తడుస్తూ జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్- అమెరికా జాతీయ గీతాలను ఆలపించారు.
విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్ ఇంటర్ కాంటినెంటల్ విల్లార్డ్‌కు చేరుకున్నారు. జాతీయ పతాకాలను చేత పట్టుకుని హోటల్ బయట వందల సంఖ్యలో ఎదురు చూస్తోన్న ప్రవాస భారతీయులను పలకరించారు మోదీ. వారికి అభినందనలు తెలియజేస్తూ ముందుకు సాగారు. వారు అందించిన పుష్పగుచ్ఛాలను స్వీకరించారు. పిల్లలతో ఆప్యాయంగా చేతులు కలిపారు. పెద్దలకు శిరసు వంచి నమస్కరించారు.

హోటల్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం మోదీ వర్జీనియాలోని అలెగ్జాండ్రియాకు బయలుదేరి వెళ్లారు. అక్కడి నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌తో కలిసి వేదికను పంచుకొన్నారు మోదీ. భారత్-అమెరికా విద్యార్థులను కలుసుకున్నారు. వారితో ముఖాముఖి భేటీలో పాల్గొన్నారు.

వివిధ విశ్వవిద్యాలయాలు, అత్యున్నత విద్యా సంస్థల మధ్య కెరీర్-కనెక్ట్, లెర్నింగ్, వర్క్‌ఫోర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌లల్లో రెండు దేశాల విద్యార్థులు పరస్పర అవగాహన, భాగస్వామ్యాలను నెలకొల్పడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన డాక్టర్ సేతురామన్ పంచనాథన్ వ్యవహరిస్తోన్నారు. ఇదివరకు ఈ ఫౌండేషన్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ సందర్శించారు.
-
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications