వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు మోడీ, జిన్ పింగ్ ముఖాముఖీ-బ్రిక్స్ సదస్సు వేదికగా ఆన్ లైన్లో-10 నెలల తర్వాత

|
Google Oneindia TeluguNews

గతేడాది గల్వాన్ ఘర్షణలు మొదలయ్యాక ఉప్పూ,నిప్పుగా వ్యవహరిస్తున్న భారత్, చైనా అధినేతలు నరేంద్రమోడీ, జిన్ పింగ్ రేపు మరోసారి ముఖాముఖీ మాట్లాడుకోబోతున్నారు. కరోనా కారణంగా వర్చువల్ పద్ధతిలో నిర్వహిస్తున్న బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల సమాఖ్య) సమావేశంలో వీరిద్దరూ ముఖాముఖీ కలవబోతున్నారు.

SamanthaAkkineni: స్మైలీ బ్యూటీ సామ్ ఇంట హాట్ గా ఎపుడు చూసి ఉండరు (ఫొటోస్)

భారత్, చైనా మధ్య గతేడాది మార్చి నెలలో తూర్పు లడఖ్ లో ఘర్షణలు తలెత్తాయి. ఇందులో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత గతేడాది నవంబర్ లో భారత్, చైనా అధినేతలు మోడీ, జిన్ పింగ్ మాట్లాడుకున్నారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో ఇరుదేశాల మధ్య మిలటరీ స్ధాయి చర్చలు జరగడం, బలగాల ఉపసంహరణ కూడా జరిగాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల నేపథ్యంలో అక్కడ కాలుమోపేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇది ఇప్పటికే అక్కడ పెట్టుబడులు పెట్టిన భారత్ కు ఇబ్బందికరంగా మారబోతోంది. ఈ నేపథ్యంలో రేపు ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వర్చువల్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

pm modi and xi jinping will face to face in brics summit tomorrow, may discuss on afghan situation

రేపు జరిగే బ్రిక్స్ సదస్సులో మాత్రం భారత్, చైనా ఘర్షణల వ్యవహారం చర్చకు రాకపోవచ్చని తెలుస్తోంది. ఇది ద్వైపాక్షిక అంశం మాత్రం కావడంతో దీనిపై ఇరుదేశాల నేతలు స్పందించకపోవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో ఆప్ఘనిస్తాన్ లో తాజా పరిస్ధితిపై మాత్రం మోడీ, జిన్ పింగ్ స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్ ఆప్ఘనిస్తాన్ పై తన వైఖరిని తాజాగా బయటపెట్టింది. ఆప్ఘన్ గడ్డపై భారత్ వ్యతిరేక చర్యల్ని అనుమతించబోమని తేల్చిచెప్పింది. అటు చైనా మాత్రం ఆప్ఘన్ లో పెట్టుబడుల రూపంలో భారత్ ను ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్ఘన్ లో తాజా పరిస్ధితులపై మోడీ, జిన్ పింగ్ చర్చల్లో ఏం మాట్లాడుకున్నా దానికి విపరీతమైన ప్రాధాన్యం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

రేపు జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనే దేశాల్లో భారత్, చైనాయే కాదు రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా కూడా ఆప్ఘనిస్తాన్ పరిస్ధితిపై తమ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా అక్కడ తాలిబన్ల రాకతో ఉగ్రవాదానికి ఊతం లభిస్తుందన్న భయాల నేపథ్యంలో బ్రిక్స్ సదస్సు చేసే తీర్మానాలకు ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి దీర్గకాల ప్రణాళికతోనే ఈ దేశాలు ఆప్ఘన్ పై తమ వ్యూహాలు బయటపెట్టే అవకాశముంది. అయితే రష్యా, చైనాల స్పందన ఆధారంగానే మిగతా దేశాలు దీనిపై స్పందించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.

English summary
indian prime minister narendra modi and chinese president xi jinping is all set to face to face in brics virtual summit tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X