నాల్గోసారి లంక ప్రధానిగా రనిల్, మోడీ అభినందన
న్యూఢిల్లీ: శ్రీలంక ప్రధానిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన రనిల్ విక్రమ్ సింఘే(66)కు భారత ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. నాలుగోసారి శ్రీలంక ప్రధానిగా ఆయన శుక్రవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.
Congratulations & best wishes to Mr. Ranil Wickremesinghe on being sworn-in as Sri Lanka's Prime Minister. @RW_UNP
— Narendra Modi (@narendramodi) August 21, 2015 రనిల్ విక్రమ్ సింఘే నేతృత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌సీ) సోమవారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 106 స్ధానాలు గెలుచుకుంది. మాజీ అధ్యక్షుడు, ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకున్న మహేంద్ర రాజపక్సే తుది ఫలితాలు వెలువడక ముందే ఓటమిని అంగీకరించిన సంగతి తెలిసిందే.

ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ పీపుల్స్ ప్రీడం ఆలయన్స్ (యూపీఎఫ్ఏ) 95 స్ధానాలను గెలుచుకుని రెండో స్ధానంలో నిలిచింది. 225 స్ధానాలు కలిగిన శ్రీలంక పార్లమెంట్లో మెజారిటీ సాధించేందుకు ఆ పార్టీకి మరో ఏడుగురు సభ్యుల మద్దతు అవసరం. తమిళ పార్టీల మద్దతు విక్రమ్ సింఘే నాల్గోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
విక్రమ్ సింఘే మళ్లీ ప్రధాని కాబోతున్నారని తెలుసుకున్న భారత ప్రధాని మోడీ బుధవారమే ఫోన్ చేసి అభినందించారు. ఆయన నాయకత్వంలో ఇరు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలు మరితంగా బలోపేతం అవుతాయని ట్వీట్ చేశారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications