ప్రధాని మోదీ రికార్డు.. 25 దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటిస్తున్నారు. 8 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రస్తుతం ప్రధాని మోదీ ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఉన్నారు. అయితే ప్రధాని మోదీకి మరోసారి అత్యున్నత గౌరవం దక్కింది. ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పౌర పురస్కారం- "ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ టొబాగో" అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. ఈ అవార్డుతో 25 దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారం పొందిన తొలి నేతగా ప్రధాని మోదీ రికార్డు నెలకొల్పారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో ఘనత సాధించారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పౌర పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ దేశ ప్రధాని కమ్లా పెర్సాద్- బిస్సేస్సార్.. ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పౌర పురస్కారం- "ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ టొబాగో" అవార్డును ప్రధాని మోదీకి అందజేశారు. ఈ అవార్డు పొందిన తొలి భారతీయ నేతగా ప్రధాని మోదీ రికార్డు నెలకొల్పారు.
Honoured to be conferred with ‘The Order of the Republic of Trinidad & Tobago’. I accept it on behalf of 140 crore Indians. https://t.co/eQjnGWHLxV
— Narendra Modi (@narendramodi) July 4, 2025
ప్రధాని మోదీ ప్రపంచ నాయకత్వం, కొవిడ్ 19 మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ అందించిన సహకారానికి గుర్తుగా ఈ అవార్డు ప్రకటించినట్లు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమ్లా పెర్సాద్ తెలిపారు. గత పాతికేళ్లలో భారత ప్రధాని ఈ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారని అన్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. భారత్ లోని 140 కోట్ల మంది భారతీయుల తరఫున తాను ఈ అవార్డును స్వీకరిస్తున్నట్లు తెలిపారు. భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలు ఉన్నాయని అన్నారు.
అయితే అంతకుముందు గనా దేశం కూడా ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం "ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా"ను అందజేసింది. గతంలో ప్రధాని మోదీకి అనేక దేశాలు అత్యున్నత పౌర పురస్కార అవార్డులను అందజేశాయి. వాటిల్లో ప్రముఖంగా రష్యా ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆడ్రూ, యూఏఈ జావెద్ మెడల్, ఫ్రాన్స్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ లెజియన్ ఆఫ్, మల్దీవ్స్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్, అంతేకాక సైప్రస్, ఫిజీ.. తదితర దేశాల నుంచి ప్రధాని మోదీ అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారు.












Click it and Unblock the Notifications