ఇజ్రాయెల్ ప్రధాని సర్‌ప్రైజ్‌కు ప్రధాని మోదీ ఫిదా! (వీడియో)
అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్-ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉన్న బంధం కేవలం వ్యూహాత్మకమైనది మాత్రమే కాదు.. అది ఇద్దరు అగ్ర నేతల మధ్య ఉన్న గాఢమైన స్నేహ బంధం కూడా. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో చారిత్రాత్మక పర్యటన చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓ మర్చిపోలేని సర్‌ప్రైజ్ ఇచ్చారు. బుధవారం రాత్రి జరిగిన డిన్నర్‌కు నెతన్యాహు భారతీయ సంప్రదాయ దుస్తుల్లో హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు.
భారతీయ వేషధారణలో నెతన్యాహు
సాధారణంగా ఫార్మల్ సూట్లలో కనిపించే నెతన్యాహు.. ఈసారి ప్రధాని మోదీపై ఉన్న అభిమానంతో తెల్లటి కుర్తా, దానిపై ముదురు నీలం రంగు 'మోదీ జాకెట్' ధరించి కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో పంచుకుంటూ.. "మా జాయింట్ డిన్నర్‌కు ముందు, భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి నా మిత్రుడు మోదీని ఆశ్చర్యపరిచాను" అని హిందీలో ట్వీట్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ప్రధాని మోదీ భావోద్వేగ స్పందన
నెతన్యాహు వేషధారణను చూసి ముగ్ధుడైన ప్రధాని మోదీ.. దానికి ప్రతిస్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. "ఇది నిజంగా అద్భుతం! భారతీయ దుస్తుల పట్ల మీరు చూపిన ఈ మక్కువ, మన దేశ సంస్కృతి, సంప్రదాయాల పట్ల మీకు ఉన్న అపారమైన గౌరవానికి ప్రతీక" అని మోదీ పేర్కొన్నారు. ఇద్దరు నేతల మధ్య ఉన్న ఈ 'కెమిస్ట్రీ'ని నెటిజన్లు 'బ్రోమాన్స్' అంటూ ప్రశంసిస్తున్నారు.
నవ్వుల పువ్వులు
ఈ పర్యటనలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నెతన్యాహు భార్య సారా నెతన్యాహు ధరించిన ఆరెంజ్ జాకెట్, ప్రధాని మోదీ జేబులో ఉన్న కేసరి రంగు పాకెట్ స్క్వేర్ ఒకే రంగులో ఉండటాన్ని నెతన్యాహు గమనించారు. "చూడండి.. రంగులు మ్యాచ్ అయ్యాయి" అని ఆయన అనగానే.. మోదీ నవ్వుతూ "యస్, యస్.. శాఫ్రాన్(కేసరి)" అని అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి.
हमारे संयुक्त रात्रिभोज से पहले, मैंने अपने मित्र प्रधानमंत्री मोदी को पारंपरिक भारतीय परिधान पहनकर चौंका दिया। 🇮🇱🇮🇳@narendramodi pic.twitter.com/3ElIQeLY97
— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) February 25, 2026
రికార్డు సృష్టించిన ప్రధాని మోదీ
ఇజ్రాయెల్ పార్లమెంట్ 'నెసెట్'ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. ఈ పర్యటనలో రక్షణ, వాణిజ్యం, సాంకేతిక రంగాలలో కీలక ఒప్పందాలు జరగనున్నాయి. ఇజ్రాయెల్ సోషల్ మీడియా ట్రెండ్స్‌లో మోదీ పేరు టాప్ 3లో నిలవడం విశేషం. ఈ పర్యటన ద్వారా అటు ఉగ్రవాదంపై పోరాటం, ఇటు శాంతి చర్చల విషయంలో రెండు దేశాలు ఒకే తాటిపై ఉన్నాయని ప్రపంచానికి మరోసారి స్పష్టమైంది.
-
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications