• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ చెబితే కరెక్ట్..: సమర్థించిన అమెరికా, ఫ్రాన్స్: ఫాలో అవ్వాలని పిలుపు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే ఉజ్బెకిస్తాన్ పర్యటనకు వెళ్లొచ్చారు. రెండు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా వివిధ దేశాధినేతలు, ప్రధానమంత్రులతో సమావేశం అయ్యారు. అన్నింటికీ మించి- పుతిన్‌తో నిర్వహించిన భేటీ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగిన వేళ.. తన చిరకాల మిత్రుడికి మోదీ ఎలాంటి హితోపదేశం చేస్తారనేది ఆసక్తి రేపింది.

చర్చల ద్వారా..

చర్చల ద్వారా..

దీనికి అనుగుణంగా మోదీ-పుతిన్ భేటీ సాగింది. యుద్ధం చేయడాన్ని మోదీ తప్పుపట్టారు. యుద్ధం ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. శాంతియుత వాతావరణం, చర్చల ద్వారా ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చని వ్యాఖ్యానించారు. ప్రపంచ శాంతి కోసం భారత్- రష్యా అనేక దశాబ్దాలుగా పరస్పరం కలిసి పని చేస్తోన్నాయని అన్నారు.

అంతర్జాతీయ మీడియా సైతం..

అంతర్జాతీయ మీడియా సైతం..

మోదీ చేసిన ఈ వ్యాఖ్యలను అప్పట్లో అంతర్జాతీయ మీడియా సమర్థించింది. ఆయనను ఆకాశానికెత్తేసింది. వాషింగ్టన్ పోస్ట్, సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్ వంటి టాప్ మీడియా సంస్థలు.. మోదీ-పుతిన్ భేటీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాయి. వాటిపై ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. మోదీ చేసిన ప్రకటనను ఇప్పుడు తాజాగా అమెరికా, ఫ్రాన్స్ స్వాగతించాయి. యుద్ధం నిలిపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటూ అభిప్రాయపడ్డాయి.

మోదీ కరెక్ట్..

మోదీ కరెక్ట్..

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. యుద్ధానికి సమయం కాదంటూ మోదీ చెప్పిన మాట సరైనదని, దీన్ని అన్ని దేశాలు అనుసరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇది ఏ ఒక్క దేశానికి వ్యతిరేకంగా.. లేక మద్దతుగా చేస్తోన్న ప్రకటన కాదని అన్నారు. ప్రపంచదేశాలు ఎదుర్కొంటోన్న అనేక సవాళ్లను సమష్ఠిగా అధిగమించాల్సి ఉందని పేర్కొన్నారు.

స్వాగతిస్తోన్నాం..

స్వాగతిస్తోన్నాం..

మోదీ చేసిన ప్రకటనను తాము స్వాగతిస్తోన్నామని అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్ సుల్లివాన్ పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యుద్ధం చేయడానికి సమయం కాదంటూ మోదీ చేసిన ప్రకటన సరైనదేనని తాము నమ్ముతున్నామని వ్యాఖ్యానించారు. రష్యాతో సుదీర్ఘ సంబంధాలను కలిగి ఉన్న భారత్- రష్యాకు హితబోధ చేయడం అభినందనీయమని చెప్పారు.

పరస్పర అంగీకారంతో..

పరస్పర అంగీకారంతో..

ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రాథమిక నిబంధనలకు రష్యా కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని, తాను బలవంతంగా స్వాధీనం చేసుకున్న భూభాగాలను తిరిగి ఉక్రెయిన్‌కు అప్పగించాలని సుల్లివాన్ చెప్పారు. పరస్పర అంగీకారం, సుహృద్భావ వాతావరణంలో ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించాల్సిన బాధ్యత రష్యాపై ఉందని అన్నారు. రష్యాతో ఇదివరకట్లా ఆర్థిక, వాణిజ్య, దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఇంకా సమయం ఉందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

English summary
The US National Security Advisor Jake Sullivan and France President Emmanuel Macron said that the PM Modi's message to Russian President Vladimir Putin on the Ukraine war was very much welcomed by the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X