PM Modi:ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో తొలిసారిగాప్రధాని మోదీ భేటీ..?
జపాన్‌లో మూడు రోజుల పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ శుక్రవారం సాయంత్రం ఆ దేశానికి చేరుకున్నారు.హిరోషిమా వేదికగా భారతకాలమాన ప్రకారం శనివారం సాయంత్రం జీ-7 సమ్మిట్ సమావేశంలో పాల్గొంటారు. అయితే ఈ సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీతో భేటీ అవుతారని తెలుస్తోంది.
గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడుల తర్వాత తొలిసారిగా ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ నేరుగా భేటీ అవడం ఇదే తొలిసారి.అయితే ఉక్రెయిన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి ఎమైన్ జపరోవా ఏప్రిల్ నెలలో ప్రధాని మోదీతో భారత్‌లో సమావేశమయ్యారు. శనివారం సాయంత్రం జరిగే మోదీ-జెలెన్‌స్కీల సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే సమయంలో భారత్ కూడా రష్యాను వదులుకునేందుకు సిద్ధంగా లేదని సంకేతాలు పంపిన సమయంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదిలా ఉంటే జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, వియత్నాం ప్రధాని ఫామ్ మిన్హ్ చిన్హ్‌తో పాటు ఇతర దేశాధినేతలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు.జీ-7 సమావేశం, క్వాడ్ సమ్మిట్‌ల తర్వాత ప్రధాని మోదీ పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియాల్లో పర్యటించనున్నారు.
జపాన్‌లోని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు ప్రధాని మోదీ. ఉక్రెయిన్‌పై భారత్ స్టాండ్ చాలా స్పష్టంగా ఉందని మోదీ చెప్పారు. భారత్ శాంతిని కోరుకుంటుందని హింసని ప్రోత్సహించదని చెప్పారు.కనీస అవసరాలు లేక ఇబ్బంది పడుతున్నవారికి భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రధాని మోదీ చెప్పారు. ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు పెరిగిన నేపథ్యంలో సవాళ్లు ఎదుర్కొంటున్న దేశాలకు భారత్ మద్దతు ఉంటుందని చెప్పిన మోదీ.. రష్యా ఉక్రెయిన్ దేశాలతో సత్సంబంధాలు మెయిన్‌టెయిన్ చేస్తామని చెప్పారు.
సహకారం, కలిసి ముందుకు వెళ్లడం అనేది సరైనదని, వివాదాలను పక్కన పెట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రతిదేశంతో సత్సంబంధాలు కలిగి ఉండటం వల్ల ప్రపంచంలో శాంతి నెలకొంటుందని చెప్పారు.సార్వభౌమత్వాన్ని, న్యాయ నిబంధన, వివాదాల పట్ల శాంతి తీర్మానాలపై ప్రధాని మాట్లాడారు. పాకిస్తాన్ పై మాట్లాడుతూ ఆ దేశం ఉగ్రవాదాన్ని వీడుతామంటే మంచి సంబంధాలు కలిగి ఉంటామని, ఇది పాక్ చేతిలోనే ఉందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications