ఇదీ ఎజెండా.. జాన్సన్‌తో మోడీ మీట్.. కాప్26లో క్లైమెట్ యాక్షన్ ఇండియా ఎజెండా ఇదే
వాతావరణ మార్పుల గురించి మరియు సాధించిన విజయాల గురించి కాప్26 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను వివరిస్తారు. ప్రధాని మోడీతోపాటు పొలాండ్ ప్రధాని మ్యాటెజ్ మొరవికి, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిషన్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ప్రసంగిస్తారు.
గ్లాసొ చేరుకున్నానని ప్రధాని మోడీ కాసేపటి క్రితం ట్వీట్ చేశారు. మోడీ బస చేసిన హోటల్ ముందు చాలా మంది భారతీయులు అక్కడికి చేరుకున్నారు. అక్కడ వారు భారత్ మాతా కీ జై అనే నినాదాలు చేశారు. ఈ పర్యటనలో మోడీ ప్రిన్స్ విలియమ్స్ ఈర్త్‌షాట్ ప్రైజ్‌ను గెలుచుకున్న టకచర్ ఫౌండర్ విద్యుత్ మోహన్, ఫైనలిస్ట్ తమిళనాడు వినిషకు చెందిన ఉమా శంకర్‌తో భేటీ అవుతారు. ఉమా శంకర్ సొలార్ పవర్‌కు చెందిన ఐరొనింగ్ కార్ట్ కనుగొన్నారు.

బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్‌తో ప్రధాని మోడీ భేటీ అవుతారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై వారు డిస్కష్ చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత.. జాన్సన్ మాట్లాడతారు. ఈ సమావేశం అత్యవసర అంశంపై డిస్కష్ చేస్తోందని చెప్పారు. ఇండియా- బ్రిటన్‌కు సంబంధించి వాతావరణ మార్పుల అంశం.. 2030 వరకు అనుసరించాల్సిన వ్యుహం గురించి డిస్కష్ చేశారు.
కరోనా వైరస్ వచ్చిన తర్వాత మోడీ- జాన్సన్ తొలిసారి మీట్ అవుతున్నారు. పునరుత్పదక శక్తి, గాలి, సౌర విద్యుత్ ఉత్పత్తి గురించి చర్చ జరగనుంది. మొబిలైజేషన్, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ గురించి డిస్కష్ చేస్తారు. స్కాట్లాండ్‌లో ఫేమస్ మ్యూజియం కెల్విగ్రొవ్ ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు.












Click it and Unblock the Notifications