ఆయన ప్రత్యేకత అదే..!!
PM Modi visits Sri Lanka: ప్రదానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నారు. నేటితో ఈ పర్యటన ముగియబోతోంది. ఈ మధ్యాహ్నం ఆయన తమిళనాడుకు చేరుకుంటారు. రామేశ్వరంలోని రామనాథస్వామివారి ఆలయాన్ని సందర్శిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాంబన్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు.
శ్రీలంక పర్యటన సందర్భంగా అక్కడి చారిత్రాత్మక జయశ్రీ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు ప్రధాని మోదీ. అనూరాధపురలో ఉంటుందీ ఆలయం. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకేతో కలిసి ఈ ఉదయం అనురాధపురాకు చేరుకున్నారు. అనంతరం జయశ్రీ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా బౌద్ధ బిక్షువులు.. ఆయనకు రక్షా సూత్రాన్ని కట్టి ఆశీర్వదించారు. బౌద్ధ భిక్షువు పాదాలను నమస్కరించారు మోదీ. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. అనంతరం రక్షా సూత్రాన్ని కట్టుకున్నారు. అనంతరం అక్కడి విజిటర్స్ బుక్‌లో సంతకం చేశారు. మహాబోధి ఆలయం ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు.
బౌద్ధమతంలో ఈ జయశ్రీ మహాబోధి ఆలయానికి- ఎంతో ప్రాధాన్యత ఉంది. చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. సామ్రాట్ అశోక చక్రవర్తి కుమార్తె అరాహత్ సంఘమిత్ర థేరి కన్నుమూసింది ఇక్కడే. ఆమె భారత్ నుండి బోధి మొక్కను తీసుకొచ్చి ఇక్కడ నాటారని విశ్వసిస్తారు.

ఇక్కడి నుంచి నేరుగా అనూరాధపురం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు ప్రధాని మోదీ, దిస్సనాయకె. మహో- అనురాధాపుర స్టేషన్ల మధ్య కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన అత్యాధునిక రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ, మహో- ఒమన్‌థాయ్ రైల్వే లైన్‌ను వారిద్దరూ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడే అవకాశం ఉంది.
మహో- అనురాధాపుర స్టేషన్ ప్రాజెక్ట్‌ను భారత్ సహకారంతో పూర్తి చేసింది శ్రీలంక. మహో- ఒమన్‌థాయ్ రైల్వే లైన్ నిర్మాణానికీ భారత్ సహకారాన్ని అందించింది. దీనికి కావాల్సిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించింది. ఈ లైన్ అందుబాటులోకి రావడం వల్ల ఈ ప్రాంతానికి రైల్ కనెక్టివిటీని కల్పించినట్టయింది.












Click it and Unblock the Notifications