పవర్‌ఫుల్ పర్సన్స్: మోడీ 9, సత్యనాదెళ్ల 61 స్థానంలో
న్యూయార్క్: ప్రపంచంలోని శక్తిమంతులైన వారి జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదవ స్థానంలో నిలిచాడు. గతేడాది పద్నాలుగో స్థానంలో నిలిచి మోడీ, ఈసారి అయిదు ర్యాంకులు ఎగబాకి... తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ మేగజైన్ ప్రపంచ శక్తిమంతుల జాబితాను విడుదల చేసింది.
తద్వారా ప్రధాని మోడీ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక 2015కుగాను రూపొందించిన అత్యంత శక్తిమంతుల జాబితాను బుధవారం విడుదల చేసింది. ఇందులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటి స్థానం కైవసం చేసుకున్నారు.
రెండో స్థానంలో జర్మనీఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, మూడో స్థానంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, నాలుగో స్థానంలో పోప్ ఫ్రాన్సిస్, ఐదో స్థానంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఉన్నారు.

టాప్ టెన్‌లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ (ఆరోస్థానం), అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్‌పర్సన్ జానెట్ యెల్లెన్ (ఏడోస్థానం), బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ (ఎనిమిదో స్థానం), ప్రధాని మోడీ (తొమ్మిదో స్థానం), గూగుల్‌కు చెందిన లారీపేజ్ (పదోస్థానం) ఉన్నారు.
ఫోర్బ్స్‌జాబితాలో భారతీయుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ కూడా చోటు దక్కించుకున్నాడు.. ఆయన 36వ స్థానంలో నిలిచారు. ఇక, విదేశాల్లోని భారత సంతతి వ్యక్తుల్లో స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ 55వ స్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల 61వ స్థానంలో నిలిచారు.
మేగజైన్ ప్రధాని మోడీ గురించి వివరిస్తూ... మోడీ తన ఏడాది పాలనలో భారత్ జిడిపి రేటును 7.4 సాధించారని పేర్కొంది. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, చైనా ప్రధాని జి జిన్ పింగ్‌ల భారత్ పర్యటనలను ప్రస్తావించింది.












Click it and Unblock the Notifications