Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్‌పై నిందలు: పీవోకేలో నిరసనలపై పాక్ సైన్యం కొత్త డ్రామా!

పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK)లో ఆసిమ్ మునీర్ నేతృత్వంలోని పాక్ సైన్యం నిరసనకారులపై దారుణాలకు పాల్పడుతోంది. పరిస్థితి అదుపు తప్పడంతో ఇప్పుడు పాక్ ఆర్మీ ప్రతినిధులు భారత్‌ను నిందించడం మొదలుపెట్టారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలను ప్రచారం చేస్తూ ఆందోళనకారులను బెదిరిస్తున్నారు.

పాకిస్తాన్‌లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం , దాని వెనుక ఉన్న అసలు అధికారి, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌తో కలిసి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నిరసనకారులపై అణచివేతకు పాల్పడుతోంది. పెరుగుతున్న ధరలు, సైన్యం దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చి పాకిస్తాన్ నుంచి స్వాతంత్య్రం(ఆజాదీ) కావాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం సైన్యం కాల్పుల్లో 12 మంది నిరసనకారులు మరణించడంతో పీవోకేలో తీవ్ర నిద్రిక్తత నెలకొంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పరిస్థితి చేయి దాటిపోవడంతో పాకిస్తాన్ ప్రభుత్వం, మునీర్ సైన్యం కలవరపడుతున్నాయి. ఇప్పుడు ఊ సమస్యను చక్కదిద్దడానికి వారు భారత్ పేరును వాడుకోవడం మొదలుపెట్టారు.

PoK Unrest Pakistan Army Blames India to Cover Up Failures Threatens Pro-Azadi Protesters

ఆర్మీ ప్రతినిధి నుంచి బెదిరింపులు
పాకిస్తాన్ ఆర్మీ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు, బెదిరింపులను ఆశ్రయిస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి నిరసనకారులను బహిరంగంగా బెదిరించారు. "నిరసన చేయడం మీ హక్కే, కానీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ధర చెల్లించకూడదు."పీవోకేలో రాజకీయ వ్యవస్థ పనిచేస్తోంది. రాష్ట్రం పన్నులు వసూలు చేయకపోతే ప్రభుత్వం జీతాలు ఎలా ఇస్తుంది?" అని చౌదరి ప్రశ్నించారు. "మీకు సమస్యలు ఉంటే, వ్యవస్థలోకి వచ్చి మాట్లాడండి" అని ఆయన అన్నారు.

వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికి భారత్ ప్రస్తావన
తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ ఎప్పుడూ భారత్ పేరును ఆశ్రయించినట్లే, ఈసారి కూడా అదే చేసింది. పాక్ ఆర్మీ ప్రతినిధి మళ్లీ కాశ్మీర్ పాట ఎత్తుకున్నారు. "పాకిస్తాన్ కలలు కన్న వ్యక్తికి కాశ్మీర్‌తో సంబంధం ఉంది. మా సైన్యంలో చాలా మంది అధికారులు, సైనికులు కాశ్మీరీలే. కాశ్మీర్ భవిష్యత్తు పాకిస్తాన్‌లో భాగం కావడం." అని చౌదరి అన్నారు.తాము గోధుమ పిండి, విద్యుత్‌ను చౌకగా అందించామని, అనేక ప్రయోజనాలను ప్రజలకు అందేలా చూశామని చౌదరి తప్పుడు వాదనలు చేశారు.

వీటన్నిటితో పాటుపాక్ ఆర్మీ ప్రతినిధి పూర్తిగా అబద్ధాలు మాట్లాడుతూ.. పీవోకే పరిస్థితి భారత్‌లోని జమ్మూ కాశ్మీర్ కంటే మెరుగ్గా ఉందని బహిరంగంగా చెప్పారు."పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత కాశ్మీర్ కంటే మెరుగ్గా ఉంది. పీవోకేలో అక్షరాస్యత శాతం భారత్‌లోని జమ్మూ కాశ్మీర్ కంటే ఎక్కువ. పీవోకేలో ఆసుపత్రులు, రోడ్లు, కళాశాలల పరిస్థితి చాలా బాగుంది. ఇక్కడ కరెంటు కూడా చౌకగా ఉంది, ద్రవ్యోల్బణం కూడా తక్కువగా ఉంది." అని ఆయన తమ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా నిరసనకారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, "ప్రతిరోజూ రోడ్లు మూసేస్తే, ఎవరు వస్తారు? మీరు రోడ్లు మూసేస్తే, ఏ ఆపరేటర్, ఏ వ్యక్తి వచ్చి ఇక్కడ పనిచేయడానికి సిద్ధపడతారు?" అని ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+