వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా చైనాలో ఆందోళనలు ఉధృతం - అరెస్టులతో ఉద్రిక్తత

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనాలో చెలరేగిన ఆందోళనలు తగ్గట్లేదు. రోజురోజుకూ మరింత ఉధృతంగా మారుతున్నాయి. కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోన్నాయి. ఇదివరకు షాంఘై సహా నాలుగైదు నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ వ్యతిరేక ప్రదర్శనలు ఇప్పుడు చైనా వ్యాప్తంగా కనిపిస్తోన్నాయి. దేశాధ్యక్షుడు గ్ఝి జిన్‌పింగ్‌ అనుసరిస్తోన్న విధానాలకు నిరసనగా లక్షలాది మంది రోడ్డెక్కుతున్నారు. తక్షణమే ఆయన దిగిపోవాలంటూ డిమాండ్ చేస్తోన్నారు.

ఈ పరిణామాలు అక్కడ పెద్ద ఎత్తున అరెస్టులకు దారి తీస్తోన్నాయి. పోలీసులు పెద్ద ఎత్తున ఆందోళనకారులను అరెస్ట్ చేస్తోన్నారు. ఈ క్రమంలో జర్నలిస్టులనూ వదలట్లేదు పోలీసులు. నిరసన ప్రదర్శనలను చిత్రీకరించడానికి ప్రయత్నించిన ఫొటో జర్నలిస్టులు, విలేకరులను అదుపులోకి తీసుకుంటోన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అరెస్టులను ఆందోళనకారులు ప్రతిఘటించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటోన్నాయి.

Police arrested thousands as protests continues in across the China over zero Covid19 policy

చైనాలో మళ్లీ కరోనా వైరస్- విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. రోజూ వేల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు పుట్టుకొస్తోన్నాయి. పలువురు కోవిడ్ పేషెంట్లు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కోవిడ్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రభుత్వం పలు నగరాల్లో కోవిడ్ ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. రాజధాని బీజింగ్ సహా గ్వాంగ్ఝౌ సిటీలో పాక్షిక లాక్‌డౌన్ అమలవుతోంది. చొంగ్‌క్వింగ్ సిటీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

చైనా ప్రభుత్వం అనుసరిస్తోన్న జీరో కోవిడ్ పాలసీ దీనికంతటికీ కారణమైంది. దీన్ని అధికారులు కట్టుదిట్టంగా అమలు చేస్తోండటం పట్ల తీవ్ర అసహనం వ్యక్తమౌతోంది. ఇన్ని సంవత్సరాలుగా లాక్‌డౌన్‌లో ఉంటూ వచ్చిన చైనీయులు- ఇంకా కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం పట్ల భగ్గు మంటోన్నారు. పెద్ద ఎత్తున నిరసనలను తెలుపుతున్నారు. ఈ క్రమంలో భద్రత సిబ్బందితో ఘర్షణ పడటానికీ వారు వెనుకాడట్లేదు. ఫలితంగా పలు నగరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటోన్నాయి.

షాంఘై సిటీలో శనివారం రాత్రి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. జీరో కోవిడ్ పాలసీని నిరసిస్తూ వేలాది మంది ప్రజలు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం తక్షణమే దిగిపోవాలంటూ నినదించారు. ప్లకార్లును ప్రదర్శించారు. కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. జిన్‌పింగ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.

English summary
As China witnessed widespread protest against stringent Covid 19 control measures, police assaulted and detained the protestors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X