టెక్సాస్‌లో కాల్పులు, ఎనిమిది మంది మృతి
టెక్సాస్‌లోని ఉత్తర డల్లాస్‌లో ఆదివారం రాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. డల్లాస్‌లో కౌబాయ్స్ ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఓ ఇంట్లో కొందరు వ్యక్తులు పార్టీ నిర్వహించారు.
టెక్సాస్: టెక్సాస్‌లోని ఉత్తర డల్లాస్‌లో ఆదివారం రాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. డల్లాస్‌లో కౌబాయ్స్ ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఓ ఇంట్లో కొందరు వ్యక్తులు పార్టీ నిర్వహించారు.
ఈ సమయంలో ఓ దుండగుడు ఇంటిలోకి జొరబడి అక్కడే ఉన్న ఓ యువతితో గొడవ పెట్టుకున్నాడు. అనంతరం తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఎనిమిదిమంది మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దుండగుడిని హతమార్చారు. కాల్పులో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications