సెల్ఫీ తీసుకుంటుండగా కాల్చి చంపిన పోలీసు
ఇస్లామాబాద్: బొమ్మ తుపాకీతో సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించిన ఓ యువకుడు పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. ఈ దారుణ ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న ఫైసలాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. పర్హాన్ అనే యువకుడు తన వద్ద ఉన్న బొమ్మ తుపాకీతో సెల్ఫీ దిగేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో అతనికి సమీపంలో ఉన్న ఓ పోలీసు.. పర్హాన్‌ను దొంగగా అనుమానించాడు.

పర్హాన్ వద్ద ఉన్నది నిజమైన తుపాకీనేనని భావించిన ఆ పోలీసులు.. అతడిపై కాల్పులు జరిపాడు. దీంతో పర్హాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, అక్కడే వున్న ఫర్హాన్ స్నేహితుడు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు.
ఆ తర్వాత మృతుడి వద్దకు వచ్చిన సదరు పోలీసు.. అతని వద్ద ఉన్నది బొమ్మ తుపాకీగా గుర్తించాడు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఉన్నతాధికారులు, సదరు పోలీసును అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications