వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వలింగ సంపర్కం పాపం కాదు - హోమోసెక్సువల్స్‌కు చట్టపరమైన రక్షణ ఉండాలి: పోప్ ఫ్రాన్సిస్

|
Google Oneindia TeluguNews

దాదాపు అన్ని మతాల్లాగే క్రైస్తవం కూడా చాన్నాళ్లపాటు స్వలింగ సంపర్కాన్ని పాపంగా పరిగణించింది. కానీ హోమోసెక్సువల్స్ కూడా దేవుడి బిడ్డలే అని, వారికి చట్టపరమైన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందంటూ క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ సంచలన సందేశమిచ్చారు. ఈ మేరకు స్వలింగ పౌర సంఘాల ఉద్యమానికి తాను మద్దతు పలుకుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

చైనీస్ నూడుల్స్ తిని 9 మంది మృతి - ఆ ఫుడ్‌ను చెత్తబుట్టలో పారేయండి - ఆరోగ్య శాఖ ఆదేశంచైనీస్ నూడుల్స్ తిని 9 మంది మృతి - ఆ ఫుడ్‌ను చెత్తబుట్టలో పారేయండి - ఆరోగ్య శాఖ ఆదేశం

వాళ్ల జీవితాలు దారుణం..

వాళ్ల జీవితాలు దారుణం..

స్వలింగ సంపర్కుల పట్ల సమాజంలో చిన్నచూపు ఉందని, దాదాపు అన్ని దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉందని, హోమో సెక్సువల్స్ లో చాలా మంది దారుణమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని గుర్తుచేసిన పోప్ ఫ్రాన్సిస్.. సివిల్ రైట్స్(పౌర హక్కుల) ద్వారానే వారికి రక్షణ కల్పించగలమని అభిప్రాయపడ్డారు. ‘‘స్వలింగ సంపర్కులకు కుటుంబంతో కలిసి జీవించడానికి హక్కుంది. వారు ముమ్మాటికీ దేవుడి బిడ్డలే'' అని పోప్ వ్యాఖ్యానించారు.

 ఆస్కార్ విజేత డాక్యుమెంటరీలో

ఆస్కార్ విజేత డాక్యుమెంటరీలో

‘వాటర్ ఆన్ ఫైర్' అనే డాక్యుమెంటరీతో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న రష్యన్ దర్శకుడు ఎవ్జిన్ అఫినెవ్‌స్కీ తాజాగా పోప్ ఫ్రాన్సిస్ జీవితంపై ‘ఫ్రాన్సిస్కో' అనే మరో డాక్యుమెంటరీని రూపొందించారు. రోమ్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా బుధవారం దానిని తొలిసారిగా ప్రదర్శించారు. అందులో పోప్ తనను ఎక్కువగా బాధకు గురిచేసే అంశాలను ప్రస్తావించారు. పేదరికం, వలసలు, ఆకలిచావులు, యుద్ధ పరిస్థితులు, మానసిక ఆందోళనలతోపాటు హోమోసెక్సువల్స్ సమస్యలపైనా తాను ప్రార్థనలు చేస్తానని పోప్ పేర్కొన్నారు.

సంచలనాల పోప్ ఫ్రాన్సిస్

సంచలనాల పోప్ ఫ్రాన్సిస్

ఎల్జీబీటీ ఉద్యమకారులకు, స్వలింగ పౌరహక్కులకు మద్దతు పలికిన మొట్టమొదటి పోప్ గా ఫ్రాన్సిస్ రికార్డులకెక్కారు. ‘ఫ్రాన్సిస్కో' డాక్యుమెంటరీ ప్రదర్శన తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎల్జీబీటీలు పోప్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. ఆయన ప్రకటనతో తమ ఉద్యమానికి ఎంతో బలం చేకూరినట్లయిందని ఎల్జీబీటీ ప్రముఖులు వ్యాఖ్యానించారు. పోప్ పదవి చేపట్టిన తొలి నాన్ యురోపయిన్ ఫ్రాన్సిస్. అర్జెంటీనాకు చెందిన ఆయన.. స్వదేశంలో ఆర్చి బిషప్ గా ఉన్న సమయంలోనే సేమ్ సెక్స్ మ్యారేజీలకు అనుమతించి క్యాథలిక్ ప్రపంచంలో సంచలనం రేపారు. గత పోప్ లకు భిన్నంగా అన్ని మతాల గురువులతో తరచూ కలుస్తూ, ఇస్లామిక్ దేశాల్లో సైతం పర్యటిస్తూ, పేదవర్గాలకు ఫ్రాన్సిస్ మరింత చేరువయ్యారు. పోప్ ఫ్రాన్సిస్, మాజీ పోప్ బెనడిక్ట్ 16 జీవితాల్లోని కీలక ఘట్టాలపై రూపొందిన ‘ది టూ పోప్స్' సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. భారత్ లోనూ స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సెక్షన్ 377పై సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు చెప్పడం తెలిసిందే.

జగన్‌పై మోదీకి ఫిర్యాదు - 18 నెలల కుదుపు - 2021లెక్కలే కీలకం - బీమా మెలిక చూశారా?: ఎంపీ రఘురామ

English summary
Pope Francis endorsed same-sex civil unions for the first time as pontiff while being interviewed for the feature-length documentary “Francesco,” which premiered Wednesday at the Rome Film Festival. “Homosexual people have the right to be in a family. They are children of God,” Francis said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X