Pope Leo XIV: ఏఐకి ఆత్మ ఉండదు.. మానవత్వాన్ని కాపాడుకుందామన్న పోప్!

ప్రస్తుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కళాకారుల శ్రమ, సృజనాత్మకత.. తీవ్ర సవాలును ఎదుర్కొంటున్న తరుణంలో వాటి రక్షణ కోసం వాటికన్ సిటీ రంగంలోకి దిగింది. మానవులు సృష్టించే అసలైన కళకు, మిషన్లు తయారుచేసే ఏఐ కంటెంట్‌‌కు మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని గుర్తించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడిందని కాథలిక్ చర్చి పోప్ లియో 14 స్పష్టం చేశారు. అల్గారిథమ్‌‌లు మిలియన్ల కొద్దీ సమాచారాన్ని విశ్లేషించి బొమ్మలు, సంగీతాన్ని సృష్టించగలవు తప్ప, వాటన్నింటికీ మూలమైన "మానవత్వపు ఆధ్యాత్మిక మెరుపు" (Spark of Humanity) ఏఐ డిజిటల్ మిషన్లలో అస్సలు ఉండదని తేల్చిచెప్పారు.

సోషల్ మీడియా వేదికగా స్పందించిన పోప్.. కళాకారుల ప్రతిభను కాపాడుకోవడానికి సాంస్కృతిక సంస్థలు, చర్చిలు ఒకటై పోరాడాలని పిలుపునిచ్చారు. ఏఐ టూల్స్ పనిచేసే విధానంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మనుషులు శ్రమించి గీసిన చిత్రాలు, సృష్టించిన కళాఖండాల ఆధారంగానే ఏఐ ప్రోగ్రామ్‌‌లు లెక్కలు వేస్తూ ప్రాసెస్ చేస్తున్నాయని, ఇది కేవలం చూడటానికి ఎలా ఉందనేది కాకుండా, అసలు సృష్టి యొక్క మూలానికే ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ సందేశానికి ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో రికార్డు స్థాయిలో కోట్లాది వ్యూస్, లక్షలాది లైకులు రావడం విశేషం.

Pope Leo XIV Warns AI Lacks Human Spark Urging Global Artists To Protect Creative Work From Machines
శతాబ్దాల తప్పుకు వాటికన్ క్షమాపణ.. AI రేసును ఆపకపోతే సర్వనాశనమే!
శతాబ్దాల తప్పుకు వాటికన్ క్షమాపణ.. AI రేసును ఆపకపోతే సర్వనాశనమే!

దివ్యాంగత్వమైనా, దివ్యత్వమైనా మనుషుల్లోనే.. ఏఐకి హెచ్చరికలు

2025లో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఏఐ వల్ల మానవ హక్కులు, ఉపాధి, ఆత్మగౌరవానికి ఎదురయ్యే ముప్పుపై పోప్ లియో 14 నిరంతరం హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆధునిక పారిశ్రామిక విప్లవంగా భావిస్తున్న ఈ టెక్నాలజీ యుగంలో మానవత్వాన్ని పణంగా పెట్టకూడదని తేల్చి చెప్పారు. ఈ ఏడాది మే నెలలో ఏఐ యుగంలో మానవ రక్షణపై ప్రత్యేక లేఖను (ఎన్సిక్లికల్) కూడా ఆవిష్కరించారు. చర్చిలోని ఫాదర్లు, బోధకులు దైవ ప్రసంగాలు రాసేందుకు ఏఐ టూల్స్ వాడకూడదని ఇప్పటికే స్పష్టమైన ఆంక్షలు విధించారు.

ట్రంప్ కు షా<strong>కిచ్చిన జేడీ వాన్స్! పోప్‌కు మద్దతు</strong>
ట్రంప్ కు షాకిచ్చిన జేడీ వాన్స్! పోప్‌కు మద్దతు

ఆలోచనలను యంత్రాలకు తాకట్టు పెట్టకండి!

యువతకు కూడా పోప్ ఒక విలువైన విజ్ఞప్తి చేశారు. ఒకవేళ రేపటి రోజున ఏఐ పూర్తిగా అదృశ్యమైపోయినా, స్వయంగా ఆలోచించి, సొంతంగా సృష్టించి, స్వతంత్రంగా వ్యవహరించే సామర్థ్యాన్ని మనుషులు కోల్పోకూడదని హితవు చెప్పారు. కేవలం ఆఫీసులు, ఫ్యాక్టరీల వరకే పరిమితం కాకుండా.. స్టూడియోలు, ఆర్ట్ గ్యాలరీలు, సాహిత్యం, సంగీతం వంటి సృజనాత్మక రంగాలను ఏఐ ఆధిపత్యం నుంచి కాపాడుకోవడానికి మానవాళి అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+