China Population: భారీగా తగ్గిపోతున్న చైనా జనాభా- వరుసగా రెండో ఏడాదీ ఢమాల్..!

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా పేరు తెచ్చుకుని, దశాబ్దాల పాటు ఆ రికార్డును కొనసాగించిన చైనాకు ఇప్పుడు అతిపెద్ద కష్టం వచ్చి పడింది. ఏ జనాభాను బలంగా మార్చుకుని అగ్రరాజ్యంగా ఎదిగిందో ఆ జనాభాయే ఇప్పుడు తగ్గిపోతోంది. అదీ అత్యంత వేగంగా. దీంతో చైనా దిక్కు తోచని స్ధితిలోకి వెళ్లిపోతోంది. ముఖ్యంగా కరోనా తర్వాత మారిన పరిస్ధితులు ఈ వైరస్ కు పుట్టినిల్లుగా చెప్పుకునే చైనా జనాభాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

2023లో చైనా జనాభా రెండు మిలియన్లు తగ్గిపోయిందని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇది వరుసగా రెండో ఏడాది జనాభా తగ్గుదల. ఇప్పటికే గత ఏడేళ్లుగా జననాల రేటు తగ్గిపోతోంది. అలాగే కోవిడ్ తర్వాత మరణాల రేటుపెరుగుతోంది. వీటి వల్ల మొత్తం జనాభా గతేడాది 20 లక్షల మేర తగ్గిపోయినట్లు చైనా ప్రభుత్వం విశ్లేషించింది. ఇప్పటికే జననాల రేటు పెంచేందుకు పలు చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతోంది.

Population decline become biggest worry to China for consecutive second year- here is why

ప్రస్తుతం చైనా జనాభా 140 కోట్లుగా ఉందని అక్కడి గణాంకాల బ్యూరో ప్రకటించింది. వాస్తవానికి గతేడాది భారత్ ఈ మార్క్ ను దాటేసి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. ఆ తర్వాత కూడా చైనాలో జననాల రేటు ఆశించినంతగా పెరగకపోగా.. మరణాల సంఖ్య పెరుగుతోంది. అలాగే చైనాలో గతేడాది వార్షిక మరణాల సంఖ్య కూడా 6.9
లక్షల నుంచి ఏకంగా దాదాపు రెట్టింపు అయి కోటీ 11 లక్షలకు చేరిపోయింది.

చైనా జనాభాలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య, 2022 డిసెంబర్లో మొదలైన కోవిడ్ వ్యాప్తి ఆ దేశ జనాభాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అదే సమయంలో గతేడాది జననాల సంఖ్య కూడా 5.4 లక్షలు తగ్గిపోయింది. గతేడాది చైనాలో మొత్తం 9 లక్షల పిల్లలు మాత్రమే పుట్టారు. ఇది 2016లో పుట్టిన పిల్లల సంఖ్యతో పోలిస్తే సగం కంటే తక్కువని గణాంకాలు చెప్తున్నాయి. దీంతో చైనా ఆందోళన అంతకంతకూ పెరిగిపోతోంది.

చైనాలో జననాల రేటు పడిపోవడం ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఎందుకంటే జననాల రేటు తగ్గడం సంతానోత్పత్తి రేటులో క్షీణతకు నిదర్శనం. ఇది దేశానికి దీర్ఘకాలిక ఆర్దిక, సామాజిక సవాలుగా మారబోతోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ముగ్గురు పిల్లల వరకు కనడాన్ని అనుమతించినా పరిస్దితుల్లో మార్పు కనిపించడం లేదు. ఇదే పరిస్ధితి కొనసాగితే కాలక్రమేణా చైనా ఆర్థిక వృద్ధి నెమ్మదించే ప్రమాదం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+