భారీ భూకంపం, రిక్టర్ స్కేల్‌పై 7.5 తీవ్రత
మెండీ: న్యూగునివాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.5 తీవ్రత నమోదైంది. సోమవారం తెల్లవారు జామునే ఈ ప్రమాదం వాటిల్లింది. భూకంపకేంద్రం భూమి లోపల 35 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.
దక్షిణ హైలాండ్‌కు రాజధాని ప్రాంతంగా ఉన్న మెండీకి సమీపంలో భూకంపం వాటిల్లింది. ఈ ప్రాంతంలో సుమారు 50 వేల మంది జనాభా నివసిస్తున్నారు.

భూకంప తీవ్రతతో స్థానికులు భయాందోళనలు చెందారు. ఇళ్ళలో నుండి పరుగులు తీశారు.సుమారు 40 సెకండ్లపాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.












Click it and Unblock the Notifications