పప్వా న్యూగినియాలో భారీ భూకంపం: సునామీ హెచ్చరిక

పపువా న్యూగినియాలో శనివారం భారీ భూకంపం సంభవించింది. ఫలితంగా న్యూఐర్లాండ్‌ ద్వీపంలో స్వల్పసునామీ వచ్చింది.

సిడ్నీ: పపువా న్యూగినియాలో శనివారం భారీ భూకంపం సంభవించింది. ఫలితంగా న్యూఐర్లాండ్‌ ద్వీపంలో స్వల్పసునామీ వచ్చింది. కొకొపొ పట్టణంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అయితే, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. రిక్టారు స్కేలుపై 7.9గా నమోదైంది.

Powerful earthquake strikes Papua New Guinea, tsunami warning issued

మొదట తీవ్రతను 8గా ప్రకటించినప్పటికీ తరువాత 7.9కు తగ్గించడం గమనార్హం. భూమికి 103 కిమీ లోపల, టరోన్‌కు తూర్పున 46 కిమీ వద్ద భూకంపకేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా భూభౌతిక సర్వే శనివారం తెలిపింది.

పపువా న్యూగినియా తీరప్రాంతంలో సునామీ వచ్చే ప్రమాదం ఉందని పసిఫిక్‌ సునామీ హెచ్చరిక కేంద్రం(పీటీడబ్ల్యూసీ) హెచ్చరించింది. ఆ తర్వాత అలాంటి ముప్పేమీలేదని స్పష్టం చేసింది. న్యూజిలాండ్‌ కూడా మొదటి సునామీ హెచ్చరికలు జారీ చేసి తర్వాత ఉపసంహరించుకుంది. కాగా, కొన్ని ద్వీపసమూహాలకు స్వల్పంగా సునామీ తాకే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+