జపాన్‌లో 6.6 తీవ్రతతో భారీ భూకంపం: సునామీ హెచ్చరికలు లేవు
టోక్యో: జపాన్‌లో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. హోన్షు దీవుల తీరంలో 6.6 తీవ్రతతో భూమి కంపించింది. ఈ మేరకు జపాన్ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
శనివారం ఉదయం 6.57 గంటలకు ఈ ప్రాంతంలో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. భూమి కంపించడంతో ప్రజలు బయటికి పరుగులు తీశారు. అయితే, ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు.

Recommended Video
#Fukushima : సముద్రంలోకి Fukushima అణువ్యర్ధాలు-Japan వివాదాస్పద నిర్ణయం! || Oneindia Telugu
సునామీ వచ్చే అవకాశం లేకపోవడంతో ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు తెలిపారు. పదేళ్ల క్రితం జపాన్‌లో వచ్చిన సునామీతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే.












Click it and Unblock the Notifications