ఫిలిప్పీన్స్‌లో తీవ్ర భూకంపం: 15మంది మృతి, 100మందికిపై గాయాలు
దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని సురిగావ్ నగరంలో శుక్రవారం రాత్రి తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై దీని తీవ్రత 6.7గా నమోదైంది.
మనీలా: దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని సురిగావ్ నగరంలో శుక్రవారం రాత్రి తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై దీని తీవ్రత 6.7గా నమోదైంది. ఈ భూకంపం ధాటికి పలు భవనాలు నేలకొరిగాయి. ఈ ప్రకంపనల ధాటికి ఇప్పటివరకు 15 మంది మృతిచెందగా మరో 100 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
సురిగావ్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశాలు లేవని పేర్కొన్నారు. శనివారం ఉదయం కూడా 89 సార్లు ప్రకంపనలు సంభవించినట్లు ఫిలిప్పీన్స్ భూభౌతిక శాఖ అధికారి రెనాటోసొలిడమ్ వెల్లడించారు.

శుక్రవారం ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు రాత్రంతా స్థానికపార్కుల్లో తలదాచుకున్నారు. విద్యుత్, నీటి సరఫరా ఆగిపోవడంతో జనజీవనం స్తంభించింది. సురిగావ్ విమానాశ్రయంలోని రన్‌వేలపై నేల బీటలు వారడంతో విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
రహదారులు కూడా అక్కడికక్కడ బీటలు తేలడంతో రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. ఈ నగరాన్ని 1879లో 6.9 తీవ్రతతో సంభవించిన భూకంపం వణికించింది. ఆ తర్వాత మళ్లీ అంత తీవ్రతతో ఇక్కడ వచ్చిన భూకంపం ఇదేనని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications