వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవయాని అరెస్టు వెనుక ఉంది ఇండియనే?

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలో దౌత్యాధికారి దేవయాని కోబ్రాగాదె అరెస్టు వెనక ఉన్నది కూడా భారతీయుడేనని అంటున్నారు. అమెరికాలోని మాన్‌పటన్ అటార్నీగా పనిచేస్తున్న ప్రీత్ బరారానే దేవయానికి అరెస్టు ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. అమె అరెస్టుపై ప్రీత్ బరారా సుదీర్ఘమైన ప్రకటనను కూడా విడుదల చేశారు. అరెస్టు సందర్భంగా దేవయాని పట్ల మర్యాదగా ప్రవర్తించినట్లు, కాఫీ భోజనం కూడా ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

ఇంతకీ ఎవరా అనే ప్రీత్ బరారా అనే ప్రశ్న వేసుకుంటే అసక్తికరమైన సమాధానాలు దొరుకుతాయి. కొందరు ఆయనను హాలీవుడ్ నటుడు, మరో ‘క్లింట్ ఈస్ట్‌వుడ్'గా వ్యవహరిస్తుంటారట.మరికొందరు ‘మన్‌హటన్ కౌబాయ్‌‌'గా పిలుస్తారట. 2009 ప్రాంతంలో అటార్నీగా పదవి చేపట్టిన ప్రీత్ బరారా వెంటనే న్యూయార్క్‌లోని నేరస్తులను, ముఖ్యంగా వైట్ కాలర్ నేరగాళ్ల పని పట్టడం ప్రారంభించారని అంటారు.

Preet Bharara behind the arrest of Devyani Khobragade

మూడేళ్ల కిందట భారత సంతతికి చెందిన రజత్ గుప్తా, అతని సహచరుల అరెస్టుకు కారకుడై పత్రికల పతాకశీర్షికలకు ఎక్కాడు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఫ్రాడ్ ఆరోపణలపై రజత్ గుప్తా అతని మరో నలుగురు సహచరులను 2012 జూన్‌లో దోషులుగా కోర్టు నిర్ధారించింది. వారికి రెండేళ్ల జైలుశిక్ష విధించడమే కాక, 50 లక్షల డాలర్ల జరిమానా కూడా విధించింది. రజత్ గుప్తా అరెస్టుతో ప్రీత్ బరారాకి అక్కడివాళ్లు ‘ది వాల్‌స్ర్టీట్ బస్టర్' అనే నిక్‌నేమ్ పెట్టేశారు.

45 ఏళ్ల ప్రీత్ పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో పుట్టాడు. తండ్రి సిక్కు కాగా తల్లి హిందువు. ఇతని చిన్నతనంలోనే ఇతని తలిదండ్రులు అమెరికా వచ్చారని, న్యూజెర్సీలో ఆయన విద్యాభ్యాసం సాగిందని, 2012లో ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులైన 100మందిలో ఇతని పేరును టైమ్స్ పత్రిక చేర్చిందని ఇంటర్నెట్ సమాచారం.

English summary
It is said that US Attorney Preet Bharara has played main role in arresting Devyani Khobragade.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X