‘రిలీఫ్ కోసమే జార్జి బుష్ మహిళల పిరుదులను తడిమేవాడు’

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్‌ సీనియర్‌ వేధింపుల వివాదం కొనసాగుతోంది. తమను లైంగికంగా వేధించారంటూ ఇప్పటికే ముగ్గురు మహిళలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. అంతేగాక, ఆయన కార్యాలయం ఈ వేధింపుల వ్యవహారంపై వివరణ ఇచ్చింది.

జార్జి బుష్ సీనియర్ అప్పుడప్పుడూ మహిళల పిరుదులను తడిమే మాట నిజమేగానీ.. ఆయన ఆ పని చేసేది సదుద్దేశంతోనేనని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. జార్జిబుష్‌ తనను దురుద్దేశంతో తాకారంటూ జోర్డానా గ్రోల్నిక్‌ అనే నటి చేసిన ఆరోపణకు వివరణగా బుష్‌ కార్యాలయం ఈ ప్రకటన విడుదల చేసింది.

 President George HW Bush says he was trying to “put people at ease” by touching “women’s rears”

ఆందోళనతో ఉన్న వ్యక్తులను కాస్త శాంతపరిచేందుకు ఆయన ఎప్పుడూ ఒకే జోక్‌ చెప్పేవారని, (వెన్ను తట్టిన రీతిలోనే) అప్పుడప్పుడూ అలా వెనక భాగాన్ని తాకేవారని వివరించింది. కాగా, ఇప్పుడు బుష్‌ వయసు 93 ఏళ్లని, ఐదేళ్లుగా ఆయన వీల్‌చైర్‌కే పరిమితమయ్యారని వెల్లడించింది.

'సాధారణంగానే బుష్ చేతులు పక్కన నుంచున్న వారి వీపు కిందకు వస్తాయి. ఈ క్రమంలో తాకడాన్ని కొంతమంది అమాయకత్వంగా మరికొందరు దురుద్దేశంగా భావిస్తారు. ఒకవేళ ఎవరైనా ఆగ్రహం వ్యక్తం చేస్తే వెంటనే ఆయన క్షమాపణ చెప్పేస్తారు' అని బుష్ కార్యాలయం ఆ ప్రకటనలో వెల్లడించడం గమనార్హం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Two actresses have accused former President George H.W. Bush of groping them during separate photo shoots — and Bush has acknowledged he has “patted women's rears” in an attempt to “put people at ease,” according to Deadspin and Newsweek.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి