వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెమెల్లాను చంపేస్తానని బెదిరించిన డయానా: జూనర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

లండన్: ప్రిన్స్ హ్యారీ 30వ పుట్టినరోజు సందర్బంగా రాయల్ జీవితచరిత్రను రచించే ప్రముఖ రచయిత పెన్నీ జూనర్ కొత్త పుస్తకం రాశారు. ఈ పుస్తకంతో ఒక ఆశ్యర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే 'ప్రిన్సెస్ డయానా అర్దరాత్రి కెమిల్లాకు ఫోన్ చేసి నిన్ను చంపేందుకు కొంతమందిని పంపాను' అని చెప్పారని పేర్కొంది.

ప్రముఖ వెబ్ సైట్ డైలీ మెయిల్‌కి ప్రచురించిన ఆర్టికల్ ప్రకారం ప్రిన్స్ చార్లెస్‌ తన వివాహన్ని దూరంగా ఉంచి కెమిల్లా కు దగ్గరవడంతో ఒక భయానకమైన భావోద్వేగానికి ఈ విధంగా వ్యక్తం చేసిందని తెలిపాడు. ప్రిన్స్ చార్లెస్ తన సిబ్బందితో డయానాని తోసివేయ్యాలని ఆదేశాలు ఏమీ చెప్పలేదని ఆమె తనతో చెప్పిందని అన్నాడు. ప్రతిచోటా కుట్రలను తను చూసిందని, కొంతమందికి విష సందేశాలను పంపినట్లు తెలిపింది.

Princess Diana 'threatened to kill Camilla', explosive new book claims

ప్రిన్సెస్ డయానా నుంచి భయపెట్టే ఫోన్ కాల్స్‌ను కెమెల్లా అందుకుందని.. 'నిన్ను చంపేందుకు కొంతమందిని పంపాను.. వాళ్లు బయట ఉన్న గార్డెన్‌లో ఉన్నారు. కిటికీలో నుంచి చూడు.. వాళ్లు నీకు కనిపిస్తున్నారా..?' అని ఫోన్ చేసిందని పేర్కొంది.

ఆమె రాసిన పుస్తకంలోని మరి కొన్ని విశేషాలు. 'ఆ అర్దరాత్రి కెమిల్లా చనిపోతానని ఎంతగానో భయపడింది. ఐతే ఈ విషయంపై ఒక్కరు కూడా ప్రిన్సెస్ డయానాను అడిగే సాహసం చేయలేక పోయారు. ప్రిన్స్ ఛార్లెస్ తన మొదటి వివాహం జరిగిన ప్రారంభ రోజుల నుంచి తన భార్య ఆహార రుగ్మతను గుర్తించలేకపోయారు. తర్వాత ఆ విషయాన్ని ప్రిన్స్ హ్యారీ, విలియమ్‌లు విన్నారు. జేమ్స్ హెవిట్, జేమ్స్ గిల్‌బే, విల్ కార్లింగ్ సహా ఇతర పురుషులతో డయానా సంబంధాల గురించి పుస్తకంలో' ఆమె తెలిపింది.

ప్రిన్సెస్ డయానా చనిపోయిన తర్వాత ప్రిన్స్ హ్యారీ, విలియమ్ బాగోగులు ఆయాలు చూసుకోగా, వారి సురక్షితంగా రక్షణ అధికారులు చూసుకునేవారు. తల్లి పట్ల వారికున్న భావోద్వేగాలను రక్షించడానికి ఎవరూ లేరని ఆ పుస్తకంలో పేర్కొంది.

బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ ఈ నెల 15న తేదీన తన 30వ పుట్టినరోజు జరుపుకోనున్న సందర్భంలో... తల్లి ప్రిన్సెస్ డయానా నుంచి వారసత్వంగా సుమారు రూ. 100 కోట్ల సంపదను స్వీకరించనున్నారు. వీలునామాలో డయానా తన సంపదలో కొంత వాటాను ఇద్దరు కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీలకు 25 ఏళ్లు నిండాక పంచాలని పేర్కొన్నారు.

ఐతే వీలునామా అమలుదారులు మాత్రం ఆ వయసును 30కి పెంచారు. 2012లో 30వ ఏట అడుగుపెట్టిన హ్యారీ సోదరుడు ప్రిన్స్ విలియమ్స్ ఇప్పటికే అతని వాటా సంపదను పొందగా ప్రిన్స్ హ్యారీ మాత్రం ఈ నెల 15న తేదీన తన వారసత్వ సంపదను పొందనున్నాడు. 1997 ఆగస్టు 31న పారిస్‌ వెళ్తుండగా డయానా, ఆమె ప్రియుడు దోడీఫయేద్‌, కారుడ్రైవర్‌ హెన్రీపాల్‌ ప్రమాదానికి గురై దుర్మరణంపాలయ్యారు.

English summary
Princess Diana would phone Camilla Parker Bowles in the middle of the night and say she'd "sent someone to kill you", an explosive new book has claimed.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X