Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డంకీ రూట్ లో అమెరికాకు వెళ్తూ.. మధ్యలోనే హార్డ్ అటాక్ తో పంజాబీ మృతి..!

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఓవైపు అక్కడ ఏళ్ల తరబడి పాగా వేసిన అక్రమ వలసదారుల్ని స్వదేశాలకు పంపే పనిలో బిజీగా ఉంది. ఇదే క్రమంలో భారత్ కు విడతల వారీగా అక్రమ వలసదారుల్ని ప్రత్యేక విమానాలు ఎక్కించి మరీ పంపేస్తోంది. వీరిలో చాలా మంది ఏజెంట్ల సాయంతో డంకీ మార్గంలో (కొండకోనలు, అడవులు, నదులు దాటుకుంటూ ) అమెరికాకు వెళ్లి అక్కడ పాగా వేసిన వారే ఉన్నారు. వీరిపైనే ఇప్పుడు ట్రంప్ సర్కార్ కొరడా ఝళిపిస్తోంది. అయినా భారత్ నుంచి ఇలా డంకీ మార్గంలో అమెరికాకు జనం వెళ్తూనే ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఇలాగే పంజాబ్ నుంచి బయలుదేరి డంకీ మార్గంలో అమెరికాకు వెళ్తున్న ఓ వ్యక్తి మధ్యలోనే గుండెపోటుకు గురై చనిపోయాడు. దీంతో డంకీ మార్గాల్లో అమెరికాకు వలసలు ఆగలేదని స్పష్టమవుతోంది. ఓవైపు ట్రంప్ అక్రమ వలసలపై ఉరుముతున్నా పంజాబ్ కు చెందిన గుర్ ప్రీత్ సింగ్ అనే వ్యక్తి ఏకంగా ఏజెంట్ కు 16.5 లక్షలు చెల్లించి మరీ ఇలా డంకీ మార్గంలో అమెరికాకు బయలుదేరాడు. మధ్యలోనే గుండెపోటుకు గురై చనిపోయాడు.

Punjab man travelling US via dunki route dies of heart attack amid immigrants deportation

33 ఏళ్ల గుర్ ప్రీత్ సింగ్ భారత్ లోని ఏజెంట్ ద్వారా బయలుదేరాడు. గయానాకు వెళ్లిన తర్వాత అక్కడ మరో పాకిస్తాన్ ఏజెంట్ సాయంతో ముందుకు కదిలాడు. అక్కడి నుంచి పనామా అడవుల ద్వారా కొలంబియాకు వెళ్లాడు. మధ్యలో ఓసారి ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు గ్వాటెమాలాలో ఉన్నట్లు చెప్పాడు.

చివరికి అతను గుండెపోటుకు గురై చనిపోయినట్లు అతనితో పాటు ఉన్న సహచరులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. చివరికి అతని మృతదేహాన్ని పంజాబ్ కు ఎలాగోలా తరలించారు. పంజాబ్ చేరుకున్నాక అక్కడి మంత్రి కుల్దీప్ సింగ్ ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎవరూ ఇలా అక్రమ మార్గాల్లో అమెరికా వెళ్లొద్దని సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+