పుతిన్ పదవికి ఎసరు పెట్టిన జో బైడెన్: ఎంతోకాలం అధికారంలో ఉండలేడంటూ: వైట్‌హౌస్ ఏం చెబుతోంది?

వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్నభీకర యుద్ధం నెల రోజులను దాటేసింది. ప్రపంచ దేశాలన్నింటినీ ఆందోళనలోకి నెట్టేసింది. మూడో ప్రపంచ యుద్ధం తప్పబోదనే సంకేతాలను పంపించింది. కిందటి నెల 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధంలో అంచనాలకు మించిన ప్రాణ, ఆస్తినష్టాలు సంభవిస్తోన్నాయి. అయినప్పటికీ- రెండు దేశాలు వెనకడుగు వేయట్లేదు. ఒకవంక శాంతి చర్చలు కొనసాగిస్తూనే.. దానికి సమాంతరంగా దాడులు, ప్రతిదాడులకు దిగుతున్నాయి.

రెచ్చిపోతున్న రష్యా..

రెచ్చిపోతున్న రష్యా..

రష్యా సంధిస్తోన్న రాకెట్లు, మిస్సైళ్ల ధాటికి ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలు ధ్వంసం అయ్యాయి. మరుభూమిగా మారాయి. రష్యాతో వెనకడుగు వేయించడానికి అగ్రరాజ్యం అమెరికా సహా పాశ్చాత్య దేశాలు చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించట్లేదు. ఏ మాత్రం ప్రభావాన్ని చూపించట్లేదు. తనపై ఆంక్షల ఒత్తిళ్లు తీవ్రతరమౌతున్న కొద్దీ- రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ తీవ్రతను కూడా అదే స్థాయిలో పెంచుతున్నారు. మరింత రెచ్చిపోతున్నారు.

 ముగిసిన టూర్..

ముగిసిన టూర్..

యూరోపియన్ యూనియన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో సభ్యత్వం ఉన్న అన్ని దేశాలు రష్యాను అష్టదిగ్బంధనం చేశాయి. రష్యాపై మరిన్ని ఒత్తిళ్లను తీసుకుని రావడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా కదిలారంటే.. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బెల్జియం, పోలాండ్‌లల్లో ఆయన పర్యటించారు. పోలాండ్‌-ఉక్రెయిన్ సరిహద్దు నగరంలో మకాం వేశారు. ఆ దేశ రాజధాని వార్సాలో కూడా కీలక భేటీల్లో పాల్గొన్నారు. ఆ దేశాధ్యక్షుడు ఆండ్రెజ్ దూదాతో సమావేశమయ్యారు.

ఎంతో కాలం కొనసాగలేడు..

ఎంతో కాలం కొనసాగలేడు..

అనంతరం వార్సా రాయల్ క్యాజిల్ నుంచి ప్రసంగించారు. జో బైడెన్ ప్రసంగంలో అందరి దృష్టినీ మరల్చుకున్న అంశం- రష్యాలో అధికార మార్పిడి. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను పదవీచ్యుతుడిని చేయడం. ఇప్పుడు ఈ పాయింట్- చర్చనీయాంశంగా మారింది. దేవుడు దయ తలిస్తే- ఈ మనిషి (పుతిన్) ఎంతో కాలం పదవిలో కొనసాగలేడు..అని జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఎంతోకాలం పాటు పదవిలో కొనసాగకూడదని తాను కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.

 చిట్టచివరి ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు..

చిట్టచివరి ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు..

బెల్జియం, పోలాండ్ పర్యటన ముగింపు సందర్భంగా- తన చిట్టచివరి ప్రసంగంలో బైడెన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జో బైడెన్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. నాటో, యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలతో కలిసి అటు రాజకీయంగానూ ఆయన పుతిన్‌ను ఎదుర్కొనే ప్రయత్నాలకు తెర తీసినట్టే భావించారంతా. పోలాండ్ అధ్యక్షుడితో నిర్వహించిన భేటీలో ఈ అంశం మీదే ప్రధానంగా చర్చ సాగి ఉండొచ్చనీ అంచనాలు వేశారు.

వైట్‌హౌస్ ఏం చెబుతోంది?

వైట్‌హౌస్ ఏం చెబుతోంది?

బైడెన్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే- ఆయన అధికారిక నివాసం వైట్‌హౌస్.. ఓ ప్రకటన విడుదల చేసింది. రష్యాలో అధికార మార్పిడి వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. పుతిన్‌ను పదవీచ్యుతుడిని చేయాలనే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది. అధికార మార్పిడికి సంబంధించిన అంశాలేవీ చర్చకు రాలేదని పేర్కొంది. రష్యా ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిళ్లను తీసుకుని రావాలనేది తమ వ్యూహంలో భాగం కాదని తేల్చి చెప్పింది.

స్పందించిన క్రెమ్లిన్..

స్పందించిన క్రెమ్లిన్..

బైడెన్ చేసిన అధికార మార్పిడి వ్యాఖ్యలపై అటు రష్యా కూడా ఘాటుగా స్పందించింది. అభ్యంతరాన్ని తెలిపింది. తమ దేశాధ్యక్షుడు అధికారంలో కొనసాగాలా? వద్దా అనేది నిర్ణయించేది బైడెన్ కాదని పేర్కొంది. రష్యన్ సమాఖ్య ప్రజలు దీన్ని నిర్ణయిస్తారంటూ క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ చెప్పారు. తమపై రాజకీయపరంగా ఒత్తిళ్లను తీసుకుని రావాలనుకోవడం అమెరికా చేతిలో లేదని, రష్యా సార్వభౌమత్వాన్ని కించపర్చలేరని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+