Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రహస్య స్థావరంలోకి పుతిన్ ఫ్యామిలీ, వారి కోసం లేటెస్ట్ టెక్నాలజీతో సైబీరియాలో బంకర్

ఉక్రెయిన్ రష్యాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నడుస్తున్న ఈ యుద్ధంలో వేలసంఖ్యలో ప్రజలు, సైనికులు మరణించారు. ఉగ్రరూపంలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన కుటుంబ సభ్యులను రహస్య ప్రాంతానికి తరలించినట్లుగా బ్రిటన్ కు చెందిన ఒక మీడియా సంస్థ వెల్లడించింది.

సైబీరియన్ భూగర్భ నగరానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కుటుంబం

సైబీరియన్ భూగర్భ నగరానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కుటుంబం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన కుటుంబ సభ్యులను సైబీరియన్ భూగర్భ నగరానికి తరలించారని, అణు యుద్ధం నుండి బయటపడేందుకు రూపొందించిన బంకర్ లోకి వారిని తరలించారని సమాచారం. ఒకవేళ అను యుద్ధం జరిగిన సురక్షితంగా ఉండేలా రష్యా అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అట్లయ్ పర్వత ప్రాంతంలోని అత్యాధునిక వసతులతో రూపొందించిన బంకర్ లోకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కుటుంబాన్ని తరలించినట్లు గా సమాచారం.

అణుయుద్ధం సంభవించినా రక్షించే అత్యాధునిక బంకర్ లో పుతిన్ ఫ్యామిలీ

అణుయుద్ధం సంభవించినా రక్షించే అత్యాధునిక బంకర్ లో పుతిన్ ఫ్యామిలీ

మాస్కో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మాజీ ప్రొఫెసర్ వాల్రీ సోలోవే కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ మానసిక, శారీరక సమస్యలతో బాధపడుతున్నారని ఆరోపించారు. యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో, 61 ఏళ్ల ప్రొఫెసర్ పుతిన్ ఇటీవలి రోజుల్లో సైబీరియాలోని 'భూగర్భ నగరంలో' తన కుటుంబ సభ్యులను దాచిపెట్టారని పేర్కొన్నారు. విలాసవంతమైన హైటెక్ బంకర్ అట్లయ్ పర్వతాలలో ఉందని, అణు యుద్ధం సంభవించినప్పుడు రక్షణ కోసం రూపొందించబడిందని సోలోవే పేర్కొన్నాడు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ పై మాజీ ప్రొఫెసర్ సోలోవే వ్యాఖ్యలు

రష్యా అధ్యక్షుడు పుతిన్ పై మాజీ ప్రొఫెసర్ సోలోవే వ్యాఖ్యలు

రష్యా కైవ్ మరియు ఖార్కివ్‌లను మిస్సీ స్ట్రైక్స్‌తో దాడి చేయడం కొనసాగిస్తున్నప్పటికీ, పుతిన్ కుటుంబాన్ని సైబీరియాలోని 'భూగర్భ నగరానికి' తరలించారని సోలోవే చేసిన వ్యాఖ్యలు రష్యా అధ్యక్షుడు నిస్సహాయ ఉక్రేనియన్లపై యుద్ధం చేస్తున్నారనే ఆరోపణలకు దారితీసింది. ప్రొఫెసర్ సోలోవే గతంలో పుతిన్ వైద్య సమస్యలతో బాధపడుతున్నారని ఆరోపించాడు. అతని రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో కలిసి విచిత్రమైన రహస్య ఆచారాలలో కూడా పాల్గొన్నాడని ఆయన ఆరోపించారు.

Recommended Video

    Russia Ukraine Conflict : Russia పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు Ukraine ఫిర్యాదు | OneindiaTelugu
    పుతిన్ పై వ్యాఖ్యలపై సోలోవేను విచారించిన అధికారులు,

    పుతిన్ పై వ్యాఖ్యలపై సోలోవేను విచారించిన అధికారులు,

    కొంతమంది ప్రొఫెసర్ సోలోవే వ్యాఖ్యలను కొట్టిపారేసినప్పటికీ, అతను నిర్వహిస్తున్న టెలిగ్రామ్ సైట్‌లో పుతిన్ వైద్య పరిస్థితిపై వచ్చిన ఆరోపణలపై రష్యా అధికారులు గత వారం ఏడు గంటలపాటు అతన్ని విచారించారని నివేదికలు చెబుతున్నాయి.సోలోవే నివాసంలో కూడా సోదాలు నిర్వహించామని, పలు ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నామని నివేదికలు పేర్కొన్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+