Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పుతిన్ కు బ్లడ్ క్యాన్సర్.. తీవ్ర అస్వస్థత; మాజీ బ్రిటిష్ గూఢచారి సంచలనం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని మాజీ బ్రిటిష్ గూఢచారి క్రిస్టఫర్ స్టీల్ అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. పుతిన్ అనారోగ్యం ఏమిటో ఖచ్చితంగా స్పష్టంగా తెలియదని పేర్కొన్న ఆయన, ఇది నయం చేయలేనిదని, అంతిమంగా ఉందా లేదా మరేదైనా దశలో ఉందా అనేది తెలియదని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన ఒక మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలను వెల్లడించారు.

పుతిన్ ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ బ్రిటిష్ గూఢచారి

పుతిన్ ఆరోగ్యంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ బ్రిటిష్ గూఢచారి

డోనాల్డ్ ట్రంప్‌పై ఒక పత్రాన్ని వ్రాసిన మరియు 2016 యూఎస్ ఎన్నికల ప్రచారంలో రష్యా జోక్యాన్ని ఆరోపించిన క్రిస్టోఫర్ స్టీల్ అంతర్జాతీయ మీడియాతో పుతిన్ ఆరోగ్యంపై చేసిన వ్యాఖ్యలలో ఖచ్చితంగా, రష్యా మరియు ఇతర ప్రాంతాల మూలాల ప్రకారం, పుతిన్, తీవ్రమైన జబ్బుతో బాధ పడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు.

రష్యా నాయకుడితో సన్నిహిత సంబంధాలు ఉన్న ఒక సమూహం "పుతిన్ బ్లడ్ క్యాన్సర్‌తో చాలా అనారోగ్యంతో ఉన్నాడు" అని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

పుతిన్ ఆరోగ్యం గురించి ఆసక్తికర రికార్డింగ్

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సన్నిహితంగా ఉండే వ్యక్తి మాట్లాడిన రికార్డింగ్‌లో పుతిన్ ఉక్రెయిన్‌పై దాడికి ఆదేశించే ముందు ఆయన వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్నారని చెప్పారు. యుఎస్ మ్యాగజైన్ కు లభించిన రికార్డింగ్‌లో, పేరులేని ఓ వ్యక్తి పాశ్చాత్య వెంచర్ క్యాపిటలిస్ట్‌తో పుతిన్ ఆరోగ్యం గురించి చర్చిస్తున్నట్లు ఉంది. పుతిన్ చనిపోతారని భావిస్తున్నట్టు, పుతిన్ రష్యా ఆర్థిక వ్యవస్థను, ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను మరియు అనేక ఇతర ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా నాశనం చేసాడని పూర్తిగా నాశనమయ్యాడు అని రికార్డింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

గత కొంత కాలంగా బలహీనం

గత వారం విక్టరీ డే వేడుకలతో సహా బహిరంగ కార్యక్రమాలలో రష్యా అధ్యక్షుడు పుతిన్ బలహీనంగా కనిపించారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడి ఆరోగ్యం గురించి ఊహాగానాలు తీవ్రమయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు మరియు వీడియోలలో, పుతిన్ మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో సైనిక కవాతును వీక్షించడానికి రెండవ ప్రపంచ యుద్ధ అనుభవజ్ఞులు మరియు సీనియర్ ప్రముఖుల మధ్య కూర్చున్నప్పుడు అతని కాళ్ళపై ఏదో కప్పబడి ఉన్నట్లు కనిపించింది.

అప్పుడు ఆయన ఏదో ఇబ్బందిలో ఉన్నట్టు కనిపించారు. నల్లటి బాంబర్ జాకెట్‌లో ఉన్న పుతిన్ దగ్గుతో కనిపించాడు. ఆ వీడియోలో ఆయన అనారోగ్యంగా ఉన్నట్టు కనిపించింది.

పుతిన్ ఆరోగ్యం పై ఉక్రేనియన్ మిలిటరీ ఉన్నతాధికారి కూడా వ్యాఖ్యలు

పుతిన్ ఆరోగ్యం పై ఉక్రేనియన్ మిలిటరీ ఉన్నతాధికారి కూడా వ్యాఖ్యలు

ఇటీవల, పుతిన్ మరియు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు మధ్య జరిగిన వీడియో సమావేశంలో కూడా 12 నిమిషాల క్లిప్‌లో ఆయన టేబుల్‌ని గట్టిగా పట్టుకుని ఇబ్బందికరంగా కూర్చున్నట్టు కనిపించారు. ఇప్పటికే క్రెమ్లిన్ నాయకుడికి క్యాన్సర్ మరియు ఇతర అనారోగ్యాలు ఉన్నాయని ఉక్రేనియన్ మిలిటరీ ఉన్నతాధికారి కూడా పేర్కొన్నారు.

ఉక్రేనియా మిలటరీ అధికారి మీడియాతో మాట్లాడుతూ పుతిన్ చాలా దారుణమైన మానసిక మరియు శారీరక స్థితిలో ఉన్నాడని, చాలా అనారోగ్యంతో ఉన్నాడని వ్యాఖ్యానించారు.ఈ నేపధ్యంలో పుతిన్ అనారోగ్యంపై ఇప్పుడు చర్చ జరుగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+